AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: ఆయుర్వేద పద్ధతిలో జుట్టు రాలే సమస్యకు చెక్.. పరిశోధనలో కనుగొన్న పతంజలి!

మీరు బట్టతల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జుట్టు రాలడం సమస్యకు పతంజలి శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. పతంజలి ఆయుర్వేద వైద్యుల 6 వారాల పాటు అనేక మంది రోగులపై పరిశోధనలు నిర్వహించి దీనిని కనుగొన్నారు. పరిశోధన సమయంలో రోగులకు వివిధ పద్ధతులతో చికిత్స అందించారు. అయితే ఈ పతంజలి ఆయుర్వేద చికిత్స తీసుకున్న తర్వాత వారికి జుట్టు రాలడం ఆగిపోవడమే కాకుండా కొత్త జుట్టు పెరగడం కూడా మొదలైనట్టు పతంజలి వైద్యులు చెబుతున్నారు.

Patanjali: ఆయుర్వేద పద్ధతిలో జుట్టు రాలే సమస్యకు చెక్.. పరిశోధనలో కనుగొన్న పతంజలి!
Pathanjali
Anand T
| Edited By: |

Updated on: May 06, 2025 | 10:50 AM

Share

పూర్వంతో పోల్చుకుంటే మానవుల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ప్రజలు లీడ్‌ చేస్తున్న లైఫ్‌స్టైల్‌, ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు చూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చాలా మంది జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పతంజలి వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలడం సమస్యకు పతంజలి శాశ్వత పరిష్కారాన్ని కనుగొందటున్నారు. పతంజలి ఆయుర్వేద సూత్రాల ఆధారంగా అనేక మంది రోగులపై పరిశోధనలు నిర్వహించి వారి సమస్యలకు పరిష్కారం చూపిందని వైద్యులు చెబుతున్నారు.

రోజురోజుకు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సమస్య నుండి బయటడేందుకు జనాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్గులు, ఎయిర్‌ప్లాంటేషన్ వంటివి చేయించుకుంటున్నారు. అయితే, ఇవి కూడా వారి సమస్యలను పూర్తి స్థాయిలో తీర్చలేవని కొందరి అభిప్రాయం. అయితే బట్టతల సమస్య పెరుగుతున్న నేపథ్యంలో దీనికి పరిష్కార మార్గం కనుగొనేందుకు పతంజలి దీనిపై విస్తృత పరిశోధన చేసింది. అనేక పరిశోధనల తర్వాత, బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంది.

జుట్టు రాలడం, బట్టతలలో ఇబ్బంది పడుతున్న కొందరు రోగులను పతంజలి ఎంపిక చేసింది. వారు వివిధ పద్ధతుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ వాళ్ల సమస్య పరిష్కారం కాలేదని పతంజలి గుర్తించింది. జుట్టు రాలాడానికి ముఖ్య కారణం ఏంటనే దానిపై తొలుత పరిశోధనలు చేసింది. వాత, పిత్త దోషాలు క్షీణించడం వల్ల జుట్టు రాలడం జరుగుతుందని ఆయుర్వేద సూత్రాల ఆధారంగా పతంజలి గుర్తించింది. ఇలా జట్టు రాలిపోతున్న కొంతమంది రోగులకు ఆయుర్వేద పద్దతిలో పతంజలి వైద్యులు చికిత్స అందించారు. ఈ చికిత్స తర్వాత 6 వారాలలోపు, జుట్టు రాలడం ఆగిపోవడమే కాకుండా, కొత్త జుట్టు పెరగడం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

6 వారాల చికిత్స..

బహుళ పద్ధతులతో చికిత్స పొంది కొన్ని రోజుల ఉపశమనం పొందిన తర్వాత మళ్లీ సమస్యలు ఎదుర్కొన్న కొందరికి పతంజచి చికిత్స అందించింది. వారిని 6 వారాల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. పంచకర్మ పద్ధతి ద్వారా క్రమం తప్పకుండా శుద్ధీకరణ చికిత్స అందించారు. అదే విధంగా, వారికి నోరు, ముక్కు ద్వారా మందులు ఇచ్చారు. తలకు నూనె రాసి మసాజ్ చేశారు. ఈ చికిత్సల తర్వాత రోగుల తలపై, శరీరంలోని ఇతర భాగాలపై కొత్త వెంట్రుకలు పెరగడం మొదలైంది. వాతం, పిత్తాన్ని నియంత్రించడం ద్వారా జుట్టు రాలడం సమస్యను నయం చేసి, కొత్త జుట్టు పెరిగేలా చేయవచ్చని పతంజలి వైద్యుల పరిశోధనలో తేలింది. ఈ చికిత్స శాశ్వత ఫలితాన్ని ఇస్తుందని.. ఈ చికిత్సపై మరిన్ని పరిశోధనలు చేయవచ్చని పతంజలి వైద్యులు పేర్కొన్నారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..