Health Care Tips: ఈ కూరగాయలను ఉడక బెట్టి తింటేనే పోషకాలు అందుతాయి.. అవేంటంటే!
పచ్చి కూరగాయలు తింటే మంచిదా లేక ఉడక పెట్టినవి తింటే మంచిదా.. ఈ రకమైన ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. నిజానికి కూరగాయలు పచ్చివి తింటేనే మంచిదని, పోషకాలు బాగా అందుతాయని చెబుతూ ఉంటారు. కానీ అలా కాదు. కొన్ని రకమైన కూరగాయలు ఉడక బెట్టి తింటేనే ఆరోగ్యంగా ఉంటాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. పచ్చి కూరగాయలు తినే వారి కంటే.. ఉడక బెట్టిన కూరగాయలు తినే వారే ఎక్కువ పోషకాలు గ్రహించారని తేలింది. కొన్ని రకమైన వెజిటేబుల్స్ ని ఖచ్చితంగా..

పచ్చి కూరగాయలు తింటే మంచిదా లేక ఉడక పెట్టినవి తింటే మంచిదా.. ఈ రకమైన ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. నిజానికి కూరగాయలు పచ్చివి తింటేనే మంచిదని, పోషకాలు బాగా అందుతాయని చెబుతూ ఉంటారు. కానీ అలా కాదు. కొన్ని రకమైన కూరగాయలు ఉడక బెట్టి తింటేనే ఆరోగ్యంగా ఉంటాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. పచ్చి కూరగాయలు తినే వారి కంటే.. ఉడక బెట్టిన కూరగాయలు తినే వారే ఎక్కువ పోషకాలు గ్రహించారని తేలింది. కొన్ని రకమైన వెజిటేబుల్స్ ని ఖచ్చితంగా ఉడకబెట్టి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి అవి ఏ కూరగాయలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిలగడ దుంపలు:
శీతా కాలంలో ఎక్కువగా లబించే వాటిల్లో చిలగడ దుంపలు కూడా ఒకటి. వీటిని ఉడక బెట్టి తినడం వల్ల బీటా – కెరోటీన్ స్థాయిలు ఎక్కువ అవుతాయి. అలాగే పోషకాలను కూడా బాడీ సమర్థవంతంగా గ్రహించగలదు.
వంకాయలు:
ఇటీవల వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. వంకాయలను ఉడికించి తినడం వల్ల.. అందులో పోషకాలు బైల్ యాడిస్ లతో కలిసి ఉంటాయి. ఇలా తినడం వల్ల లివర్ లో కొలెస్ట్రాల్ ను మరింత సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది.
గ్రీన్ బీన్స్:
పచ్చి గ్రీన్ బీన్స్ లో లెక్టిన్లు ఉంటాయి. వీటిని నేరుగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉడికిస్తే.. లెక్టిన్ లు న్యూట్రల్ గా మారతాయి. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్ల లెవల్స్ అనేవి మెరుగు పడతాయి. దీంతో త్వరగా జీర్ణం అవడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తాయి.
పుట్ట గొడుగులు:
చాలా మంది పుట్ట గొడుగులు పచ్చి వాటిని సలాడ్స్ లో వేసుకుని తింటూ ఉంటారు. పుట్ట గొడుగుల్ని ఉడికిస్తేనే అందులో ఉండే ఎర్గోథియోనిన్ అనే యాంటా ఆక్సిడెంట్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని విచ్ఛిన్నం చేస్తుంది. అంతే కాకుండా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీర కణాలను రక్షిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.




