Noise Pollution: దేశంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం.. శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్‌ నిజాలు!

Noise Pollution: భారతదేశంలో శబ్ద కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతోంది . నేషనల్ పార్క్ సర్వీస్ సహజ ధ్వని నివేదిక ప్రకారం.. ప్రతి 30 సంవత్సరాలకు శబ్ద కాలుష్యం మూడు..

Noise Pollution: దేశంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యం.. శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్‌ నిజాలు!
Noise Pollution
Follow us
Subhash Goud

|

Updated on: Sep 27, 2022 | 7:42 AM

Noise Pollution: భారతదేశంలో శబ్ద కాలుష్యం స్థాయి నిరంతరం పెరుగుతోంది . నేషనల్ పార్క్ సర్వీస్ సహజ ధ్వని నివేదిక ప్రకారం.. ప్రతి 30 సంవత్సరాలకు శబ్ద కాలుష్యం మూడు రెట్లు పెరుగుతోంది. కోవిడ్ సమయంలో లాక్‌ డౌన్‌ సమయంలో ఈ కాలుష్యం గణనీయంగా తగ్గింది. కానీ గత ఒకటిన్నర సంవత్సరాలుగా, పరిస్థితి మునుపటిలానే ఉంది. శబ్ధ కాలుష్యంపై శాస్త్రవేత్తలు పరిశోధన కూడా చేయగా, ఈ కాలుష్యం వల్ల మెదడుకు అనేక రకాల వ్యాధులు వస్తాయని తేలింది.

డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ ఇంకే కాస్ట్రే పరిశోధన చేశారు. శబ్ధం స్థాయి పెరిగితే, అది మనం వినే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. అయితే ప్రశాంత వాతావరణంలో శరీరం చాలా బాగుంటుంది. అధిక శబ్దం మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. విపరీతమైన శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. శబ్దం నిరంతరం పెరగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఇది డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

యువత వినికిడి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం:

ఇవి కూడా చదవండి

శబ్ధ కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. భారతదేశంలో శబ్ధ కాలుష్యం కారణంగా యువత వినికిడి శక్తిని కోల్పోతున్నారు. భారతదేశంలో కూడా వినికిడి యంత్రాల అవసరం పెరిగింది. వాహనాల హారన్‌లు పెద్ద శబ్దం, శబ్దం కాలుష్యం వ్యాప్తికి ప్రధాన కారణం. ఇప్పటికే వినికిడి శక్తి తక్కువగా ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. అలాంటి వారి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. మెట్రో నగరంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్ల మందికి వినికిడి లోపం ఉందని, శబ్ధ కాలుష్యం వల్ల ఈ సమస్య వేగంగా పెరుగుతోందని WHO చెబుతోంది. 2030 నాటికి భారతదేశంలో వినికిడి లోపం ఉన్న వారి సంఖ్య 130 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తోంది. ఈ కాలుష్యాన్ని అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోకపోతే, రాబోయే కాలంలో ఇది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

ఈ సమస్య ఉన్నవాళ్లలో తక్కువ మంది మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. భారతదేశంలో 10 మందిలో 2 మంది మాత్రమే వినికిడి లోపం కోసం చికిత్స పొందుతున్నారు. ఇతర వ్యక్తులు ఈ సమస్యతో జీవిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వారి సంఖ్య చాలా ఎక్కువ.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?