- Telugu News Health Sleeping disorder if you face restlessness usually then follow home care these tips
Health Tips: మీరు తరచుగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సహజ చిట్కాలను పాటించిచూడండి
రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా విశ్రాంతి లేనట్లు ఇబ్బంది పడుతున్నారా.. దీనిని వైద్య పరిభాషలో రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇటువంటి నిద్ర సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సహజ చిట్కాలను పాటించవచ్చు. ఈరోజు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
Updated on: Sep 27, 2022 | 11:52 AM

రాత్రి నిద్రలేమి కారణంగా పరిపూర్ణంగా నిద్రపోలేకపోతున్నారా? నిద్ర పోవాలంటే బెడ్ మీద రెండు నుండి నాలుగు గంటల పాటు ఎదురుచూస్తూ ఉండాలా.. ఇటువంటి సమస్యకు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో కూడా ఉపశమనం లభించవచ్చు.

ఎసెన్షియల్ నూనె: అకస్మాత్తుగా నిద్రలేమి, విశ్రాంతి దొరకక పోవడం వల్ల గంటల తరబడి నిద్రపట్టడం లేదని తరచుగా కొంతమంది వాపోతుంటారు. అయితే ఈ సమస్యను నూనె సహాయంతో అధిగమించవచ్చు. నిద్రపోయే ముందు దిండుపై రెండు మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి నిద్రించడానికి ప్రయత్నించండి.

దీర్ఘ శ్వాస: రాత్రి సమయంలో విశ్రాంతి లేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ముఖ్యమైనది లెగ్స్ సిండ్రోమ్‌గా పరిగణించబడుతుంది. దీన్ని అధిగమించడానికి, రాత్రి పడుకునే ముందు సుమారు 10 నిమిషాల పాటు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ పద్ధతి మిమ్మల్ని రిలాక్స్‌గా చేస్తుంది. బాగా నిద్రపోతుంది.

నడక: అశాంతి ఉన్నప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. దీని కోసం, వీలైతే.. ఆరుబయట చల్లని గాలిని ఆస్వాదించండి. బయటకు వెళ్లండి లేదా డాబాపైకి వెళ్లి కాసేపు నడవండి. కడుపులో గ్యాస్ కారణంగా అసౌకర్యం ఉండవచ్చు. నడక ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను అధిగమించవచ్చు

నీరు తాగే విధానం: రాత్రిపూట ఎక్కువగా తినడం లేదా తినే ఆహారం సరైంది కాకపోవడం వల్ల కడుపు సమస్యలు వస్తాయి. మీకు వీలైనప్పుడల్లా నీరు త్రాగండి. రాత్రి సమయంలో మాత్రం ఎక్కువ నీరు త్రాగకండి. నీటిని అధికంగా తీసుకోవడం వలన నిద్ర లేమి సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే జీలకర్ర, నల్ల ఉప్పు, వాము నీటిని తయారు చేసి త్రాగవచ్చు.




