AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: మీకు పెరుగు అంటే ఇష్టమేనా..? అయితే ఈ పదార్థాలతో కలిపి తింటే సమస్యల్లో చిక్కుకున్నట్లే..!

Curd: ఆరోగ్యాన్ని కొన్ని పదార్థాలు ఎంతో మంచివి. కానీ తినే విధానంలో కొన్ని పద్దతులున్నాయి. సాధారణంగా పెరుగు అనేది అందరికి ఇష్టమే. చాలా మందికి ప్రతి రోజు పెరుగు లేనిది నోట్లోకి ముద్ద..

Curd: మీకు పెరుగు అంటే ఇష్టమేనా..? అయితే ఈ పదార్థాలతో కలిపి తింటే సమస్యల్లో చిక్కుకున్నట్లే..!
Curd
Subhash Goud
|

Updated on: Sep 26, 2022 | 1:52 PM

Share

Curd: ఆరోగ్యాన్ని కొన్ని పదార్థాలు ఎంతో మంచివి. కానీ తినే విధానంలో కొన్ని పద్దతులున్నాయి. సాధారణంగా పెరుగు అనేది అందరికి ఇష్టమే. చాలా మందికి ప్రతి రోజు పెరుగు లేనిది నోట్లోకి ముద్ద వెళ్లదు. తినే ముందు తప్పనిసరిగ్గా పెరుగు కావాల్సిందే. అయితే పెరుగు ఇష్టం కదా అని అన్ని పదార్థాలతో తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన పెద్దలు చెప్పేమాట. అందుకు వైద్యులు కూడా పెరుగు మంచిదేనని సూచిస్తుంటారు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పెరుగులో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే పెరుగుని మనం ఎక్కవగా ఇతర ఆహారంతో కలిపే తీసుకుంటుంటాం. అయితే పెరుగు కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూసేద్ధాం.

మామిడి:

పెరుగును మామిడి పండుతో కలిపి ఎప్పుడు తినకూడదు. అలా కలిపి తినడం వల్ల శరీరంలో అలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఈ రెండు కలిపి తినడం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మామిడి పండు, పెరుగు కలిపి తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలతో కలిపి పెరుగు.. ఉల్లిపాయలతో కలిపి పెరుగు తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లి శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చల్లదనానికి కారణమవుతుంది. ఈ రెండు కలిపి తినడం వల్ల సోరియాసిస్‌, దద్దుర్ల వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే లేనిపోని సమస్యలతో ఆస్పత్రుల్లో చేరి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

పాలు, పెరుగు:

ఇక పెరుగును పాలతో కలిపి తినడం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. రెండు తెల్లగానే ఉన్నా.. సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రెండు కలిపి తినడం వల్ల డయేరియాతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఇలా తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.

చేపలతో పెరుగు:

పెరుగు, చేపలు ఈ రెండింటిలో ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల కడుపులో గ్యాస్‌ సమస్య వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే చేపలతో పెరుగును కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగు అలవాటు ఉన్నవారు ఇలా ఏది పడితే అలా ఇతర పదార్థాలతో తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. ఈ పదార్థాలతో పెరుగును కలిపి తింటే తర్వాత ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడే అకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని కొన్ని పదార్థాలు ఎంతో మంచివి. కానీ తినే విధానంలో కొన్ని పద్దతులున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండేందకు మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడున్న కాలంలో కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి..

Follow Us