Night Sweats: వామ్మో.. నిద్రపోతున్నప్పుడు చెమట పడుతుందా..? అయితే, పెను ప్రమాదంలో ఉన్నట్లే..
Night Sweats Reasons: ఉరుకులు, పరుగుల జీవితం.. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర ముఖ్యం. రాత్రిపూట 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం ఉత్తమం.. కానీ ఒత్తిడి లేదా ఇతర సమస్యల కారణంగా చాలామంది రాత్రి వేళ సరిగా నిద్రలేకపోతున్నారు. దీంతో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే, చాలా మందికి రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు చెమట పడుతుంది. మీకు కూడా ఇలా జరిగితే..

Night Sweats Reasons: ఉరుకులు, పరుగుల జీవితం.. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర ముఖ్యం. రాత్రిపూట 6 నుంచి 7 గంటలు నిద్రపోవడం ఉత్తమం.. కానీ ఒత్తిడి లేదా ఇతర సమస్యల కారణంగా చాలామంది రాత్రి వేళ సరిగా నిద్రలేకపోతున్నారు. దీంతో అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే, చాలా మందికి రాత్రిపూట నిద్రిస్తున్నప్పుడు చెమట పడుతుంది. మీకు కూడా ఇలా జరిగితే.. నిర్లక్ష్యం చేయవద్దంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి పడుకున్నప్పుడు చెమటలు పట్టడం, నిద్ర లేవగానే బట్టలన్నీ తడిసిపోవడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవానికి వేసవిలో ఇలా జరగడం సహజమే.. కానీ మీరు ఏసీ ఆన్‌లో ఉంచుకుని నిద్రిస్తున్నట్లయితే లేదా చలికాలంలో కూడా నిద్రపోతున్నప్పుడు ఇలా జరిగితే మాత్రం ఆందోళన కలిగించే విషయమేనంటూ హెచ్చరిస్తున్నారు. అసలు నిద్రపోతున్నప్పుడు చెమటలు పట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
నిద్రపోతున్నప్పుడు చెమట ఎందుకు పడుతుంది..
సంక్రమణ: శరీరం సంక్రమణతో పోరాడినప్పుడు.. అది దాని ఉష్ణోగ్రతను పెంచుతుంది.. ఇది చెమటను కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్ కారణంగా రాత్రిపూట చెమటలు పట్టే కొన్ని సాధారణ వ్యాధులు జ్వరం, ఫ్లూ, సిఫిలిస్, HIV.. అని అర్ధం చేసుకోవాలి.
థైరాయిడ్ వ్యాధి: థైరాయిడ్ అనేది హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంధి. ఈ హార్మోన్లు శరీరం అనేక విధులను నియంత్రిస్తాయి. థైరాయిడ్ విధుల్లో ఒకటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరిగి, చెమట పట్టేలా చేస్తుంది.
క్యాన్సర్: కొన్ని రకాల క్యాన్సర్లు (లింఫోమా, లుకేమియా వంటివి) కారణంగా రాత్రిపూట చెమటలు పడతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
ఆందోళన – ఒత్తిడి: ఆందోళన, ఒత్తిడి కూడా రాత్రి చెమట పట్టడానికి కారణం కావచ్చు. ఆందోళన కూడా చెమటలు ఎక్కువగా పట్టేందుకు కారణమవుతుంది.
మందులు: కొన్ని రకాల మందులు (యాంటిడిప్రెసెంట్స్ – పెయిన్ కిల్లర్స్ వంటివి) రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం అవుతాయి.
రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెమట పట్టే సమస్య ఉంటే, అది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఈ లక్షణాలతో పాటు ఏవైనా ఇతర లక్షణాలను ఎదుర్కొంటుంటే, మీ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమన్న విషయాన్ని మరువొద్దు..
గమనిక: ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠాకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా వైద్య, ఆరోగ్య సూచనలను పాటించే ముందు లేదా సందేహాలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








