అల్లం, వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది? జరిగే మార్పులేంటో తప్పక తెలుసుకోవాలి..!
కూర ఏదైనా సరే.. దానికి మంచి రుచి రావాలంటే.. ఉప్పు, కారాలతో పాటుగా తాజా అల్లం, వెల్లుల్లి, మసాలా ఉండాల్సిందే.. ఇక్కడ తాజా అల్లం వెల్లుల్లి పాత్ర అతి ముఖ్యమైనది. కూరలకు ఇది అదిరిపోయే రుచిని ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పనిసరిగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ నిల్వ ఉంటుంది. అయితే, దీన్ని నిల్వ చేసేందుకు చాలా మంది ఫ్రిజ్‌లో పెడుతుంటారు. పెడితే ఏమౌతుంది..? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..? లేదా అనే దానిపై జనాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి విషపూరితంగా మారతాయనే పుకార్లు కూడా ఉన్నాయి. అయితే, నిపుణుల ప్రకారం, వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం తప్పనిసరి కాదని అంటున్నారు. రిఫ్రిజిరేటర్ లేని రోజుల్లో కూడా అల్లం, వెల్లుల్లి నెలల తరబడి తాజాగా ఉండేవని చెప్పారు.
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. వైద్యపరంగా, వాటిని నీరు లేని కూరగాయలు అని పిలుస్తారు. ఫ్రిజ్‌లోని చలి, తేమ వాటిలోని తేమను ఆకర్షిస్తాయి. దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. తేమతో కూడిన వాతావరణంలో బాక్టీరియా, శిలీంధ్రాలు త్వరగా పెరుగుతాయి. అందుకే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన వస్తువులు కొన్నిసార్లు త్వరగా చెడిపోతాయి.
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను బుట్టలో, మెష్ బాక్స్‌లో లేదా బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయడం మంచిదని చెబుతున్నారు.. ఇది రుచి, నాణ్యతను కాపాడుతుంది. మీరు దానిని ఫ్రిజ్‌లో ఉంచితే అది విషపూరితం కాదు. కానీ మీరు దానిని తప్పుగా నిల్వ చేస్తే, అది త్వరగా చెడిపోతుంది. కాబట్టి, పొడి ప్రదేశం ఉత్తమం. పైగా ఫ్రిజ్‌లోని ఇతర పదార్థాలు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే వంట రుచి కూడా సూపర్‌గా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




