AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Toilet: ఇదేం ట్విస్ట్.. ఇండియన్ టాయిలెట్‌ వాడితే అంత డేంజరా..!

భారతీయ టాయిలెట్ల వాడకం మోకాళ్ళకు హానికరమని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. గురవ రెడ్డి పేర్కొన్నారు. మల విసర్జన సులభతరం చేస్తుందనే సంప్రదాయ వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇండియన్ టాయిలెట్లు మోకాళ్ళపై తీవ్ర ఒత్తిడిని కలిగించి, దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తాయని, 21వ శతాబ్దంలో వాటిని నిషేధించాలని ఆయన బలంగా సూచించారు.

Indian Toilet: ఇదేం ట్విస్ట్.. ఇండియన్ టాయిలెట్‌ వాడితే అంత డేంజరా..!
Indian Toilet
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2026 | 9:58 AM

Share

భారతీయ టాయిలెట్ల వాడకంపై ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. A.V. గురవ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయం ప్రకారం, భారతీయ టాయిలెట్లలో కూర్చోవడం వల్ల మోకాళ్ళు పొట్టపై ఒత్తిడి తెచ్చి, ఇంట్రా-అబ్డామినల్ ఒత్తిడిని పెంచుతుందని, తద్వారా మల విసర్జన సులభతరం అవుతుందని నమ్మకం. ఈ వాదన పాక్షికంగా నిజమే అయినప్పటికీ, మోకాళ్ళ ఆరోగ్యానికి ఇది ప్రమాదకరమని డా. గురవ రెడ్డి హెచ్చరిస్తున్నారు. మోకాళ్ళను మడిచి కూర్చున్నప్పుడు పటెల్లో ఫ్యూమరల్ కీళ్ళపై అపారమైన ప్రెజర్ పడుతుందని, ఇది మోకాళ్ళకు నష్టం కలిగిస్తుందని ఆయన వివరించారు. ముఖ్యంగా మోకాళ్ళ సమస్యలు ఉన్నవారు భారతీయ టాయిలెట్లను ఉపయోగించకూడదని ఆయన సూచించారు. మల విసర్జనకు ఇంట్రా-అబ్డామినల్ ఒత్తిడి పెద్ద సమస్య కాదని, హై-ఫైబర్ ఆహారం తీసుకుంటే వెస్ట్రన్ కమోడ్‌లో కూడా సులభంగా మల విసర్జన చేయవచ్చని డా. గురవ రెడ్డి స్పష్టం చేశారు. 21వ శతాబ్దంలో భారతీయ టాయిలెట్లను నిషేధించాలనేది తన గట్టి నమ్మకమని డా. గురవ రెడ్డి అభిప్రాయపడ్డారు.

(ఈ సమాచారం వైద్య నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి