Health Tips: ఈ పప్పులో పోషకాలు పుష్కలం.. గుండె ఆరోగ్యానికి బెస్ట్‌..!

Health Tips: పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది.

Health Tips: ఈ పప్పులో పోషకాలు పుష్కలం.. గుండె ఆరోగ్యానికి బెస్ట్‌..!
Pesarappu
Follow us
uppula Raju

|

Updated on: May 10, 2022 | 6:35 AM

Health Tips: పప్పులు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి రెండోది చెడు కొలస్ట్రాల్‌. అయితే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఈ పరిస్థితిలో కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేయడంలో పప్పుధాన్యాలు గణనీయంగా దోహదం చేస్తాయి. అలాంటి పప్పులలో ముఖ్యమైంది పెసరపప్పు. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే లక్షణాలు ఉంటాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

పెసరపప్పు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు ఈ పప్పుని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి. ఉదర సమస్యలు ఉన్నవారు పెసర పప్పును తినాలి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ బలంగా తయారవుతుంది. పెసరపప్పు బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు దీనిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకుంటే మంచిది. మీరు ఈ పప్పును వారానికి మూడుసార్లు తినవచ్చు. దీనివల్ల మీకు చాలా లాభాలుంటాయి. గుండెను సురక్షితంగా ఉంచడంలో పెసరపప్పు సూపర్‌గా పనిచేస్తుంది.

పెసర పప్పు తీసుకోవడం ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి మొదలైన వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ మీరు ఒత్తిడికి గురైనట్లయితే ప్రతిరోజూ మీ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పెసర పప్పు తినాలి. ఇందులో ఉండే పోషకాలు శరీరం రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. ఎప్పుడైతే మీకు బాడీ వీక్ గా అనిపిస్తుందో అప్పుడు మీరు తప్పనిసరిగా పెసర పప్పు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్-బి6, నియాసిన్, ఫోలేట్ అధికంగా ఉంటాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

MI vs KKR: కోల్‌కతా సూపర్ విక్టరీ.. 113 పరుగులకే కుప్పకూలిన ముంబై..

Vitamin D: మహిళల్లో ఈ 4 లక్షణాలు ఉంటే అది విటమిన్‌ డి లోపం..!

Viral Video: ఈ మహిళా వెయిటర్‌ సూపర్.. బీర్‌ బాటిల్‌ మూత ఎలా తీసిందో చూస్తే షాక్‌..!