AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Care: కిడ్నీ సమస్యలకు రామబాణం.. వేసవిలో ఈ ఒక్క పండు వారికి అమృతంతో సమానం..

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడూ తొలగించి.. శరీరాన్ని శుభ్రంగా ఉంచేందుకు కిడ్నీలు సాయంచేస్తాయి. కానీ, ఇప్పుడు చాలా మంది అనేక రకాల కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అధిక నీటి శాతంతో ఉండే పుచ్చకాయలో టాక్సిన్స్​ను బయటికి పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి ట్యాక్సిన్​లను బయటకు పంపడమే కాకుండా మూత్ర పిండాలను హైడ్రేట్​గా ఉంచుతాయని అంటున్నారు.

Kidney Care: కిడ్నీ సమస్యలకు రామబాణం.. వేసవిలో ఈ ఒక్క పండు వారికి అమృతంతో సమానం..
Kidney Care Detox Fruit
Bhavani
|

Updated on: Mar 07, 2025 | 10:19 AM

Share

వేసవి మొదలైంది. చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సీజన్‌లో అతిపెద్ద సమస్యలలో ఒకటి డీహైడ్రేషన్. ఈ సీజన్‌లో అధికంగా చెమట పట్టడం సర్వసాధారణం. దీని కారణంగా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్ లో పుచ్చకాయ ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే పండు. కానీ దాని ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. నిజానికి, పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలోని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. వేసవిలో ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివి..

కిడ్నీ వ్యాధులకు రామబాణం..

పుచ్చకాయ 92% నీటిని కలిగి ఉన్న పండు. దీని పండ్లు మరియు విత్తనాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్ మరియు కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి. అంతేకాదు ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వారికి ఇది అమృతంతో సమానం అంటారు.

40 శాతం విటమిన్ సి..

ఇది మూత్రపిండాల నొప్పి, వాపు, ఆకలి లేకపోవడం మరియు మూత్రపిండాల ఇన్ఫెక్షన్లు వంటి వివిధ సమస్యలకు పరిష్కారం. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా, దీని రసం శరీరం నుండి విషాన్ని తొలగించి మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయలో 40% విటమిన్ సి ఉంటుంది. ఇది ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

టాక్సిన్స్​ను బయటికి పంపేస్తాయి..

ఆహారం జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే మలినాలను, వ్యర్థాలను కిడ్నీలు వడకడతాయి. అవి బయటకు వెళ్లడం కూడా ఎంతో ముఖ్యం లేదంటే కిడ్నీలు పాడవుతాయి. పుచ్చకాయలో టాక్సిన్స్​ను బయటికి పంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి ట్యాక్సిన్​లను బయటకు పంపడమే ఇన్ఫెక్షన్లు సోకకుండా చేస్తాయి..

చర్మ సంరక్షణకు..

మీ ముఖం మీద మొటిమలు, నల్లటి వలయాలు మరియు మచ్చలు వంటి చర్మ సమస్యలు ఉంటే, వాటికి పుచ్చకాయ రసాన్ని రాసుకుంటే అవి తగ్గుతాయని నమ్ముతారు. కిడ్నీకి సహాయపడే పండ్లు మీ ముఖం మీ చర్మ సమస్యలను కూడా తగ్గించగలదంటారు. ఎండన పడి వచ్చిన వారికి ముఖం వెంటనే ట్యాన్ అయిపోతుంది. అప్పుడు ఈ పండును ముక్కను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి ముఖానికి కాస్త మర్థన చేస్తే ఆ ట్యాన్ వెంటనే తొలగిపోతుంది.