గుండె బలంగా ఉండాలంటే ఇలా చేయండి..! ఈ చిన్న మార్పులు చేసి చూడండి..!
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం, తగినంత నిద్ర, మద్యపానాన్ని తగ్గించడం వంటి మార్పులు గుండె సంబంధిత సమస్యల ముప్పును తగ్గిస్తాయి. ఈ మార్పులను మీరు కూడా పాటించి ఆరోగ్యంగా ఉండండి.

ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, మద్యం, ధూమపానం వంటి కారకాల వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కానీ సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, స్ట్రెస్ కంట్రోల్ ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వ్యాయామం
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. రోజుకు కనీసం 30 నిమిషాల చురుకైన నడక, సైక్లింగ్ లేదా ఈత వంటివి చేస్తే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. దీంతో గుండె కండరాలు బలపడి రక్త ప్రసరణ మెరుగవుతుంది.
హెల్తీ ఫుడ్ డైట్
పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. అలాగే ఫాస్ట్ ఫుడ్ తినడం గుండెకు ప్రమాదకరం. ఎందుకంటే దీర్ఘకాలిక మంట, ధమనుల దెబ్బతిన్నట్టు అవుతుంది.
మద్యపానం
మద్యం ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ఇది గుండె కండరాల బలహీనతకు దారితీస్తుంది. క్రమరహిత హృదయ స్పందనలు కలుగుతాయి. మద్యం పరిమితంగా తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ధూమపానం
ధూమపానం వలన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టడం కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దూరంగా ఉండడం మంచిది.
సరైన హైడ్రేషన్
రోజంతా తగినంత నీటిని తాగడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా, రక్త ప్రసరణ సరిగా ఉండేలా చేస్తుంది. నీరు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడిపోవచ్చు. ఇది అధిక రక్తపోటు, గుండె సమస్యలకు కారణం అవుతుంది.
సరైన నిద్ర
ప్రతి రాత్రి కనీసం 7 నుండి 9 గంటల నిద్రపోవడం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఊబకాయం, క్రమరహిత హృదయ స్పందనలు కలుగుతాయి. మంచి నిద్ర జీవక్రియను, ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది.
వైద్య పరీక్షలు
గుండె సమస్యలను ముందుగానే గుర్తించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యలు గుర్తించి వాటిని నియంత్రించడం గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.




