AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో నిర్వహించిన యోగాడే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ చేయడం వలన ఆరోగ్యంగా ఉంటాము..తన తోటి మిత్రులు యోగ చేయకపోవడం వలన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు ఆయన తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు దీన్ని సంకల్పంగా తీసుకొని.. ప్రతి రోజూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Ponnam Prabhakar: రోజూ యోగా చేయండి.. నాలా ఆరోగ్యంగా ఉండండి- మంత్రి పొన్నం ప్రభాకర్!
Minister Ponnam
Sridhar Rao
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 11:07 AM

Share

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు యోగాడే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ యోగాడే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో నిర్వహించిన యోగాడే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. యోగసనాలు వేయడంలో పొన్నం ప్రభాకర్ యువకులతో పొడిపడ్డాడు. యోగా ట్రైనర్ చెప్పే యోగాసనాలు హుషారుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండడానికి కారణం ప్రతి రోజు యోగా చేయడమే అని.. అందుకే ప్రతి ఒక్కరు యోగా చేయాలని పొన్నం సూచించారు.

ప్రతి రోజూ యోగ చేయడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని..తన తోటి మిత్రులు యోగ చేయకపోవడం వలన ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని..అందుకే ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని మంత్రి పొన్నం అన్నారు. యోగాడే సందర్బంగా ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకొవాలని.. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.ప్రస్తుతం ఎంతో మంది పని ఒత్తిడితో సతమతమవుతున్నారని.. ప్రతి రోజు యోగా చేయడంతో ఇలాంటి ఆన్ని సమస్యలకు చెక్‌పెట్టవచ్చని అన్నారు. దీనికి ప్రత్యేకంగా జాతి, మతం లేదని.. యోగాను ఒక్క రోజు కార్యక్రమంలా కాకుండా జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

వీడియో చూడండి..

ఇక ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరి చందన, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..