Migraine Effects: మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఈ ఆహారాలను తీసుకోకూడదు!
సాధారణ తల నొప్పితో భావిస్తే.. మైగ్రేన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ అంటే చాలా మంది తల నొప్పే అనుకుంటారు. మైగ్రేన్ అంటే తలలో ఒక వైపు వచ్చే తల నొప్పి. ఈ నొప్పి వస్తే నిద్ర పట్టదు, ఒక పట్టాన కూర్చోలేం, ఏ పనీ చేయలేం ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈ మైగ్రేన్ తో పాటు ఇంకొంత మందిలో వికారం, వాంతులు, శబ్దాల్ని తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఇది ఒక వైపు వస్తే.. మరి కొందరికి మార్చి.. మార్చి కుడి పక్కా, ఎడమ పక్కా..

సాధారణ తల నొప్పితో భావిస్తే.. మైగ్రేన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మైగ్రేన్ అంటే చాలా మంది తల నొప్పే అనుకుంటారు. మైగ్రేన్ అంటే తలలో ఒక వైపు వచ్చే తల నొప్పి. ఈ నొప్పి వస్తే నిద్ర పట్టదు, ఒక పట్టాన కూర్చోలేం, ఏ పనీ చేయలేం ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈ మైగ్రేన్ తో పాటు ఇంకొంత మందిలో వికారం, వాంతులు, శబ్దాల్ని తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఇది ఒక వైపు వస్తే.. మరి కొందరికి మార్చి.. మార్చి కుడి పక్కా, ఎడమ పక్కా వస్తుంది. ఒత్తిడి వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది ఎటాక్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక వైపు తల నొప్పితో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పులియ బెట్టిన ఆహారాలు:
పులియ బెట్టిన పచ్చళ్లు, ఫ్రూట్ జ్యూస్ లలో థైరమైన్ అనేది ఉంటుంది. దీని వల్ల మైగ్రేన్ అనేది తీవ్ర తరం అవుతుంది. కాబట్టి మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు వీలైనంత వరకూ పులియ బెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. నిల్వ పచ్చళ్లు తినకూడదు.
ఆల్కహాల్:
ఆల్కహాల్ లో ఇథనాల్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. ఇథనాల్ బాడీలోకి వెళ్లగానే ఓ రసాయనంగా మారుతుంది. దీని వల్ల మైగ్రేన్ అనేది తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఒక వైపు తల నొప్పితో ఇబ్బంది పడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.
కెఫీన్ ఉన్న పదార్థాలు తినకూడదు:
కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. కెఫీన్ లో బీటా ఫెనిలేథైలమైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా మైగ్రేన్ ను తీవ్ర తరం చేస్తుంది. కాబట్టి టీ, కాఫీలు, చాక్లెట్లు, ఇంకా కెఫీన్ ఉన్న వాటిని దూరంగా ఉంచండి.
చల్లగా ఉండే వాటిని అస్సలు తీసుకోకూడదు:
చల్లగా ఉండే పదార్థాలను కూడా తీసుకోకూడదు. ఐస్ మైగ్రేన్ తో ఉన్న వారు తాగడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మైగ్రేన్ తో భాధ పడేవారు వీలైనంత వరకూ ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.