Diabetes Treatment: వేగంగా నడిస్తే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహం దీర్ఘకాలిక వ్యాది. మధుమేహంలో టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉంయి. చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతుంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో, రక్తంలో చక్కెర సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో చక్కెర (గ్లూకోజ్)గా విభజించబడి రక్తప్రవాహంలోకి విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేయడాన్ని సూచిస్తుంది. శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు లేదా కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం..

మధుమేహం దీర్ఘకాలిక వ్యాది. మధుమేహంలో టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉంయి. చాలా మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతుంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో, రక్తంలో చక్కెర సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో చక్కెర (గ్లూకోజ్)గా విభజించబడి రక్తప్రవాహంలోకి విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేయడాన్ని సూచిస్తుంది. శరీరం తగినంత ఇన్సులిన్ తయారు చేయనప్పుడు లేదా కణాలు ఇన్సులిన్‌కు ప్రతిస్పందించడం ఆపివేసినప్పుడు, రక్తప్రవాహంలో చక్కెర పెరిగిపోతుంది.
ఇది కాలక్రమేణా గుండె జబ్బులు, కంటి జబ్బులు, మూత్రపిండాల వ్యాధి వంటి తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయంన ప్రకారం.. ఇది వేగవంతమైన నడక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి నిపుణులు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం సిఫార్సు చేస్తారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో గంటకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో (సుమారు 2.5 మైళ్లు) నడవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో లేదా గంటకు 1.86 మైళ్ల వేగంతో నడిచే వారికి టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. నడక వేగాన్ని గంటకు 1 కి.మీ పెంచడం వల్ల మధుమేహం 9 శాతం తగ్గుతుందని కూడా గుర్తించారు. గంటకు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో లేదా గంటకు 3.7 మైళ్ల వేగంతో నడిచే వారిలో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 39 శాతం తగ్గించవచ్చు. ‘టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో వేగవంతమైన నడక ఎలా సహాయపడుతుందో నిర్ధారించడానికి తదుపరి పరిశోధనలు చేస్తున్నట్లు UKలోని సీనియర్ కన్సల్టెంట్ నీల్ గిబ్సన్ చెప్పారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు గత 11 ఏళ్లుగా నిర్వహించిన 10 అధ్యయనాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. పరిశోధకులు 1999 – 2022 మధ్య 5,08,121 మందిబనుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. సగటున లేదా సాధారణ వేగంతో 3-5 కిలోమీటర్లు నడిచే వ్యక్తుల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం 15 శాతం తగ్గినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.