Men Health: పురుషులకు అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవండి.. వివరాలే..
ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు కనిపించేవి. కానీ, ఇప్పుడు చిన్న వయస్సులోనే శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా పురుషులు ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనులు, ఇతర కార్యక్రమాల కారణంగా స్వంత

ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా అనారోగ్య సమస్యలు కనిపించేవి. కానీ, ఇప్పుడు చిన్న వయస్సులోనే శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా పురుషులు ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనులు, ఇతర కార్యక్రమాల కారణంగా స్వంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మగవారు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మరి వారిలో వచ్చే వ్యాధులు ఏంటి? ఆ లక్షణాలేంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బులు..
ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య గుండె జబ్బులు. చిన్న వయసులోనే ఎంతో మంది గుండె జబ్బులకు బలి అవుతున్నారు. హైబీపీ సమస్య సర్వసాధారణమైపోతోంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజూ మంచి ఆహారం తినడం, వ్యాయామం చేయడం, సరైన జీవనశైలిని నిర్వహించాలి. గుండె జబ్బులకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలి.
మధుమేహం..
మధుమేహం అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. భారతదేశంలో మధుమేహం బాధితుల సంఖ్య 100 మిలియన్లు దాటింది. సరైన జీవనశైలి, జన్యుపరమైన కారణాల వల్ల మధుమేహం వస్తుంది. ప్రస్తుత కాలంలో 30 సంవత్సరాల వయస్సు తర్వాత, పురుషులలో మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటోంది. ఇది ప్రాణాంతకం కావొద్దంటే.. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా రోజూ వ్యాయామం చేయాలి.




ఒత్తిడి, ఆందోళన..
ఇతర వ్యాధుల మాదిరిగానే ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య కావచ్చు, ఇవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. దీని కారణంగా పురుషులు ఆందోళన, నిరాశకు గురవుతారు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. ఈ నేపథ్యంలో పురుషులు తమ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




