High Risk Pregnancy: గర్భిణులూ బీ అలర్ట్.. ఈ సమస్యలుంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూడాల్సిందే.. జాగ్రత్తలు పాటించకపోతే కష్టం..
హైరిస్క్ ప్రెగ్నెన్సీ అనేది తల్లి, ఆమె గర్భంలోని పిండం ఇద్దరి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఈ సమయంలో గర్భిణులకు మరింత కేరింగ్ అవసరం. ముఖ్యంగా గర్భిణుల్లో మధుమేహం, వారి వయస్సు, వైద్య చరిత్ర, ఇంతకు ముందు ఏమైనా గర్భస్రావం అయ్యిందా వంటి వివరాల ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి మహిళకు ఓ పునర్జన్మ లాంటిందని పెద్దలు అంటూ ఉంటారు. నిజమే తొమ్మిది నెలల పాటు గడుపులో భారం అనుకోకుండా బరువును మోస్తూ.. ప్రసవవేదన తర్వాత తన స్వరూపాన్ని బయటకు తీసుకురావడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఈ సమయంలో వారు అనేక ఇబ్బందులకు గురవతారు. వారి శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారైతే మరిన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా పలు కారణాల వల్ల హై రిస్క్ ప్రెగ్నెన్సీ జాబితాలోకి వైద్య నిపుణులు చేర్చారంటే వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైరిస్క్ ప్రెగ్నెన్సీ..
హైరిస్క్ ప్రెగ్నెన్సీ అనేది తల్లి, ఆమె గర్భంలోని పిండం ఇద్దరి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఈ సమయంలో గర్భిణులకు మరింత కేరింగ్ అవసరం. ముఖ్యంగా గర్భిణుల్లో మధుమేహం, వారి వయస్సు, వైద్య చరిత్ర, ఇంతకు ముందు ఏమైనా గర్భస్రావం అయ్యిందా వంటి వివరాల ఆధారంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఏ ఇద్దరి గర్భిణుల లక్షణాలు, వారి ఇబ్బందులు ఒకేలా ఉండవు. ఇది మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి, సరైన ప్రినేటల్ కేర్ ఎటువంటి సమస్యలనైనా నివారించి, ఆరోగ్యకరమైన ప్రసవానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
ఎటువంటి సంక్లిష్టత లేకుండా గర్భిణులు సుఖ ప్రసవం జరగాలంటే ఎల్లప్పుడూ గైనకాలజిస్ట్ ల పర్యవేక్షణలో ఉండాలి. ఒకవేళ వైద్యులు ఎవరినైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద గుర్తిస్తే.. వాటిని నిర్ధారించేందుకు కొన్ని అదనపు పరీక్షలు, పర్యవేక్షణ, చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక కేసులన చూసిన నిపుణులు అసలు హైరిస్క్ ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణాలను గుర్తించారు. అవేంటో ఓ సారి చూద్దాం..
హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణాలు..
గర్భిణి వయస్సు.. వృద్ధాప్యంలో సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుతాయి. పురుషుల్లో స్పెర్మ్, మహిళల్లో అండాల నాణ్యత వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపుతుంది. చాలా మందికి, ముఖ్యంగా మొదటి సారి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ముప్పై ఏళ్ల లోపే ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
దీర్ఘాకాలిక వ్యాధులు.. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు మొదలైన వాటికే పరిమితం కాకుండా వారి ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుంచి ప్రత్యేక శ్రద్ధ, పర్యవేక్షణ అవసరం. ముందుగా ఉన్న వైద్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో వారి పరిస్థితిని నిర్వహించడానికి వైద్యులతో కలిసి పని చేయాలి.
గర్భస్రావాలు.. గతంలో గర్భస్రావాలు అనుభవించిన స్త్రీ కూడా తన గర్భధారణ ప్రయాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భం దాల్చడానికి ప్రయత్నించే ముందు కూడా వారి వైద్యుల సహాయం తీసుకోవాలి.
మధుమేహం.. గర్భధారణ సమయంలో మధుమేహం ప్రమాదకరమైన అంశం. మహిళలు, ముందుగా మధుమేహం లేకుండా కూడా, కొన్నిసార్లు గర్భధారణ సమయంలో చక్కెర స్థాయిలు పెరగడంతో గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రీ-ఎక్లాంప్సియా, ప్రీటర్మ్ లేబర్, సిజేరియన్ సెక్షన్ అవసరానికి కూడా దారి తీస్తుంది.
అధిక రక్తపోటు.. గర్భధారణ సమయంలో స్త్రీకి అధిక రక్తపోటు ఉన్నట్లయితే, అది ప్రీ-ఎక్లాంప్సియా ప్రమాదాన్ని పెంచుతుంది, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతక తీవ్రతతో కూడిన తీవ్రమైన పరిస్థితి. అధిక రక్తపోటు ఉన్న స్త్రీలు క్రమం తప్పకుండా ప్రినేటల్ కేర్ పొందాలి. వారి గర్భధారణ సమయంలో వారి రక్తపోటును నిర్వహించడానికి వారి ఆరోగ్య సంరక్షణకు వైద్యులతో కలిసి పని చేయాలి.
ఎస్టీడీలు.. లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీలు) గర్భిణీ స్త్రీలకు, వారి శిశువులకు కూడా గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తాయి. ఎస్టీడీలు ముందస్తు ప్రసవానికి, తక్కువ బరువుతో పుట్టడానికి కారణమవుతాయి. గర్భవతిగా ఉన్న లేదా గర్భవతి కావాలనుకునే స్త్రీలు ముందుగా పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలి.
అనారోగ్యకరమైన జీవనశైలి.. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం తల్లి, బిడ్డను ప్రమాదంలో పడేస్తాయి. గర్భధారణ సమయంలో ధూమపానం చేయడం వల్ల తక్కువ బరువు, నెలలు నిండకుండానే పుట్టడం ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయి. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (ఎఫ్ఏఎస్), వంటి పుట్టుకతో వచ్చే లోపాలకు దారి తీస్తుంది. ఈ ప్రమాదాలను తగ్గించడానికి గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం.
గర్భిణులు సుఖ ప్రసవం కోసం ఇలా చేయాలి..
- ముందుగా హై రిస్క్ ప్రెగ్నెన్సీకి గల కారణాలు అన్వేషించాలి. వాటిని తగ్గించడానికి హెల్త్‌కేర్ ప్రొవైడర్‌తో ప్రినేటల్ చెక్-అప్‌లు చేయించుకోవాలి.
- నడక, స్విమ్మింగ్, ప్రినేటల్ యోగా లేదా తక్కువ-ప్రభావంతో కూడడిన ఏరోబిక్స్ వంటి సురక్షిత వ్యాయామాలు చేయాలి.
- మానసిక ఒత్తిడి లేకుండా చూడాలి. యాంగ్జైటీకి గురి కాకుండా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి.
- తల్లి ఆరోగ్యం, పిండం అభివృద్ధి, ఏవైనా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి సరైన పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి.
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, పాల ఉత్పత్తులతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
- మీ వైద్యుడు సూచించిన విధంగా ప్రినేటల్ విటమిన్లు లేదా ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి సప్లిమెంట్లు స్వీకరించాలి.
- మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







