Health: ఒక సిరంజితోనే విద్యార్థులకు కరోనా టీకాలు.. ఆ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్న నిపుణులు..
తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయడానికి ఒకటే సిరంజిని ఉపయోగించడాన్ని గమనించి అతన్ని ప్రశ్నించారు. వ్యాక్సినేటర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Man vaccinates 39 students with 1 syringe: అతనొక ఆరోగ్య కార్యకర్త.. అన్నీ తెలిసి కూడా ఒకే సిరంజీతో 39 మంది పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్ వేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒకరికి ఒకే సూది.. ఒకే సిరంజి ఉపయోగించాలని తరచూ ప్రభుత్వం సూచిస్తుంటుంది. కానీ ఆరోగ్య కార్యకర్తే ఇలా చేయడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ నగరంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో 39 మంది పిల్లలకు యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయడానికి వ్యాక్సినేటర్ అదే సిరంజిని ఉపయోగించినట్లు అధికారులు గురువారం తెలిపారు. బుధవారం నాడు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు టీకాలు వేయడానికి ఒకటే సిరంజిని ఉపయోగించడాన్ని గమనించి అతన్ని ప్రశ్నించారు. వ్యాక్సినేటర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని, వ్యాక్సినేటర్‌పై జితేంద్ర అహిర్వార్‌పై కేసు నమోదు చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు.
ఈ ఘటనపై మహీమ్-ఎ ఫోర్టిస్ అసోసియేట్‌లోని ఎస్‌ఎల్ రహేజా హాస్పిటల్ కన్సల్టెంట్ & హెడ్ క్రిటికల్ కేర్ డాక్టర్ సంజిత్ శశీధరన్ మాట్లాడుతూ ‘ఒక సూది, ఒక సిరంజి, వన్ టైమ్’ అనేది కర్తవ్యం.. ఎల్లప్పుడూ సూచించే విషయం. అంటే ఇది వేరే విధంగా చేయలేము.. సహజంగా ఉండాలి అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
చాలా మంది వ్యక్తులకు ఒక సిరంజిని ఉపయోగించడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు..
1990ల నుంచి హెచ్‌ఐవి వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పటి నుంచి డిస్పోజబుల్ సిరంజిలు ఒకరికే ఉపయోగించేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. అలా చేయడమే మంచిది. సిరంజిలు లేదా సూదుల పునర్వినియోగం అనేది అసురక్షిత ఇంజెక్షన్ పద్ధతిలో అత్యంత భయంకరమైనది. ఎందుకంటే ఇది రక్తంలో వ్యాధికారక వ్యాప్తికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. అనేక వ్యాప్తి పరిశోధనల ద్వారా రుజువు కూడా అయింది.
ఈ విషయాలపై డాక్టర్ శశీధరన్ న్యూస్9తో పలు కీలక విషయాలను పంచుకున్నారు.. ఇలా చేయడం వల్ల అంటు వ్యాధులు సంక్రమించే అవకాశాలను అత్యధికంగా ఉన్నాయి. సూది లేదా సిరంజిని మళ్లీ ఉపయోగించడం వల్ల రోగులకు హెపటైటిస్ సి వైరస్ (హెచ్‌సివి), హెపటైటిస్ బి వైరస్ (హెచ్‌బివి), హెచ్‌ఐవి సోకే ప్రమాదం ఉందని తెలిపారు.
‘‘ఈ 30 మంది విద్యార్థులకు నెక్రోటైజింగ్ ఫాసిటిస్ (మాంసాన్ని తినే బ్యాక్టీరియా) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. నెక్రోటైజింగ్ ఫాసిటిస్ సోకిన వ్యక్తిలో ఇది త్వరగా.. దూకుడుగా వ్యాపిస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ సైట్, వెలుపల కణజాల మరణానికి కారణమవుతుంది’’ అని ఆయన చెప్పారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) మార్గదర్శకాలు ‘‘సింగిల్-డోస్’’ లేదా ‘‘సింగిల్-యూజ్’’ అని లేబుల్ చేసిన మందులను ఒక రోగికి మాత్రమే ఉపయోగించాలని పిలుపునిస్తున్నాయి. ఈ అభ్యాసం రోగులను అసురక్షిత వినియోగం నుంచి కలుషితం చేసినప్పుడు సంభవించే ప్రాణాంతక అంటువ్యాధుల నుంచి రోగులను రక్షిస్తుంది.
సిరంజి పునర్వినియోగం ఇతర రోగుల రక్తాన్ని రోగులకు బహిర్గతం చేస్తుంది (నేరుగా ఉపయోగించిన సిరంజి/సూది ద్వారా లేదా పరోక్షంగా ఉపయోగించిన సూది లేదా సిరంజి ద్వారా కలుషితమయ్యే మందుల కంటైనర్ ద్వారా). CDC వీటిని ‘‘ఎప్పుడూ జరగని సంఘటనలు’’గా పరిగణిస్తుంది. ఈ పద్ధతులు గుర్తిస్తే వారు రక్తంలో సంక్రమించే వ్యాధికారక క్రిములకు సంభావ్యంగా బహిర్గతమయ్యే రోగులకు పరీక్షలను చేసి మందులు అందించాలి.
సూదుల కొరత ఉందా? అనే ప్రశ్నకు శశీధరన్ బదులిస్తూ.. ‘‘లేదు, సూదులు, సిరంజిల కొరత భారతదేశంలో అస్సలు లేదు’’ అని పేర్కొన్నారు. ఇది అజాగ్రత్త కేసు అని, లేకపోతే నిర్లక్ష్యంగా పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం.. వ్యాక్సినేటర్ జితేంద్ర, అధికారులు ఒక సిరంజిని మాత్రమే పంపారని, పిల్లలందరికీ టీకాలు వేయమని “విభాగాధిపతి” ఆదేశించారని పేర్కొన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులు రికార్డు చేసిన వీడియోలో జితేంద్ర తన పేరు తనకు తెలియదని చెప్పాడు.
‘‘మెటీరియల్స్ (టీకా) డెలివరీ చేసిన వ్యక్తి ఒకే సిరంజిని మాత్రమే ఇచ్చాడు’’ అని జితేంద్ర చెప్పడాన్ని తల్లిదండ్రులు రికార్డ్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. ఒక సిరంజిని ఎక్కువ మందికి ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగించకూడదని మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నకు.. జితేంద్ర “నాకు అది తెలుసు. అందుకే నేను ఒక సిరంజిని ఉపయోగించాలా అని నేను వారిని అడిగాను.. వారు ‘అవును’ అన్నారు.. ఇది నా తప్పా? నేను వారు చెప్పినట్లే చేశాను’’ అని పేర్కొన్నాడు.
Shocking violation of “One needle, one syringe, only one time” protocol in #COVID19 #vaccination, in Sagar a vaccinator vaccinated 30 school children with a single syringe at Jain Public Higher Secondary School @ndtv @ndtvindia pic.twitter.com/d6xekYQSfX
— Anurag Dwary (@Anurag_Dwary) July 27, 2022
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..