AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rheumatoid Arthritis: ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నారా..? మీ లైఫ్ లో ఈ మార్పులు చేస్తే..

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనిపిస్తున్న వ్యాధి. ముఖ్యంగా కీళ్లవాపు, నడవలేకపోవడం, భరించలేని నొప్పి ఈ వ్యాధి లక్షణాలుగా మనం చెప్పవచ్చు.

Rheumatoid Arthritis: ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నారా..? మీ లైఫ్ లో ఈ మార్పులు చేస్తే..
Rheumatoid Arthritis
Madhavi
| Edited By: |

Updated on: Apr 26, 2023 | 9:58 AM

Share

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనిపిస్తున్న వ్యాధి. ముఖ్యంగా కీళ్లవాపు, నడవలేకపోవడం, భరించలేని నొప్పి ఈ వ్యాధి లక్షణాలుగా మనం చెప్పవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులు దీర్ఘకాలం పాటు వేదన పడుతూ ఉండటం మనం చూసే ఉంటాము, అయితే ఈ వ్యాధికి కేవలం మందులు మాత్రమే కాదు ,లైఫ్ స్టైల్ లో కూడా చాలా మార్పులు చేసుకుంటేనే తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఎక్కువగా నడివయసులో ఉన్నటువంటి మహిళల్లోనూ పురుషుల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మహిళల్లో ఈ వ్యాధి కనిపించడం మనం చూస్తూ ఉంటాము. కేవలం కీళ్లనొప్పులు మాత్రమే కాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఇతర లక్షణాలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, నిద్ర లేకపోవడం, చిగుళ్ల నొప్పి, బరువు పెరగడము, నిద్ర పట్టకపోవడం, వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందుకే రుమటాడ్ ఆర్థరైటిస్ ను వీలైనంత త్వరగా కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది

రెగ్యులర్ గా వ్యాయామం చేయడంఆర్థరైటిస్ వ్యాధితో బాధపడేవారు రెగ్యులర్ గా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఫిజియోథెరపిస్టు సలహా మేరకు ఎక్సర్సైజ్ చేస్తే సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా వాకింగ్ చేయడం. అలాగే మోకాళ్లతో ఎక్సర్సైజ్ చేయడం, చిన్న చిన్న బరువులు లేపడం వంటివి చేయడం ద్వారా కండరాలు పటిష్టం అవడంతో పాటు వాపు కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాంసాహారం విషయంలో చాలా లిమిట్ గా ఉండాలి. మసాలాలు తీపి ఉప్పు కారం విషయంలో చాలా పరిమితి ఉండాలి. ఆకుకూరలు, పప్పు దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు మాంసాహారంలో చేపలను ఉండేలా జాగ్రత్త పడాలి. సాల్మన్ టూన్ చేపలను తినడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది.

అధిక బరువును తగ్గించుకోవాలిరుమటాయిడ్ ఆర్థరైటిస్కు అధిక బరువు అనేది శత్రువు. ముఖ్యంగా మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పడాలి. అధిక బరువు ఉంటే ఎక్ససైజ్ డైటింగ్ ద్వారా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి

రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడేవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇందు కోసం యోగ ప్రాణాయామం వాటి విద్యలను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. . అలాగే సరైన నిద్రపోవాలి అప్పుడే ఒత్తిడికి దూరంగా ఉంటారు. అలాగే అధిక శ్రమతో కూడిన మానసిక ఒత్తిడితో కూడిన పనులకు దూరంగా ఉండాలి.

స్మోకింగ్ ఆల్కహాల్ కు దూరంగా ఉండాలిరుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ రెండిటికీ చాలా దూరంగా ఉండాలి ఈ రెండిటి వల్ల శరీరంలో వాపు కలిగించే వ్యాధులను రెట్టింపు అయ్యేలా చేస్తుంది. . అందుకే ఆల్కహాల్ స్మోకింగ్ రెండింటికి కూడా దూరంగా ఉంటే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

Follow Us