Chepa Mandu: ఆస్తమా బాధితులు ఊపిరి పీల్చుకునే శుభవార్త..! ఈ యేడు చేపమందు ప్రసాదం ఎప్పుడంటే..

కాగా చేప మందు కోసం దేశ నలుమూలల నుంచి ఆస్తమా బాధితులు హైదరాబాద్‌‌కు‌‌‌ వస్తారు. బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం జనాలు తెల్లవారుజామునుండే కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బస చేసి.. చేప మందు కోసం ఎదురు చూస్తుంటారు. వీరికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.

Chepa Mandu: ఆస్తమా బాధితులు ఊపిరి పీల్చుకునే శుభవార్త..! ఈ యేడు చేపమందు ప్రసాదం ఎప్పుడంటే..
Chepa Mandu
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 25, 2023 | 5:39 PM

ఆస్తమా బాధితులకు నిజంగానే ఇది శుభవార్తగా చెప్పాలి. ఎందుకంటే, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఆగిపోయిన చేపమందు ప్రసాదం ఈ యేడు పంపిణీకి అనుమతి లభింఇచంది.. ఈ ఏడాది చేపమందు పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు పంపిణీ చేయడానికి బత్తిని సోదరులకు అనుమతి లభించింది. దీంతో చేపమందు పంపిణీపై బత్తిని సోదరులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఏడాదీ ఉచితంగా బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తుంటారు. శాస్త్రీయ ఆధారాలు ఎలా ఉన్నా.. చేపమందుకోసం ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఉబ్బసం వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ కి వస్తుంటారు. కరోనా వల్ల మూడేళ్లుగా పంపిణీ వాయిదా పడింది. ఈఏడాది ఎట్టకేలకు అనుమతి లభించింది. పంపిణీ ఎప్పుడు..?

చేపమందుని పంపిణి చేయడంలో ప్రసిద్ధి చెందారు హైదరాబాద్ వాసులు బత్తిన సోదరులు. గత175 ఏళ్లుగా సంప్రదాయబద్ధంగా బత్తిని కుటుంబం చేపమందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. ప్రతి సారి ఎన్ని వివాదాలొచ్చినా, చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప మందు ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు. అయితే కరోనా కారణంగా 2020 నుంచి చేప మందు పంపిణీ నిలిపివేశారు. కాగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప మందును బత్తిని సోదరులు త్వరలో పంపిణీ చేయనున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు.

కాగా చేప మందు కోసం దేశ నలుమూలల నుంచి ఆస్తమా బాధితులు హైదరాబాద్‌‌కు‌‌‌ వస్తారు. బత్తిన సోదరులు అందించే చేప మందు కోసం జనాలు తెల్లవారుజామునుండే కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. వివిధ రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బస చేసి.. చేప మందు కోసం ఎదురు చూస్తుంటారు. వీరికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..