AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం…తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

మన ఆయుర్వేదంలో ప్రతి మొక్కలోను ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని కోట్లాది మొక్కల ఔషధ గుణాలు వాటి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో వివరంగా తెలిపారు.

బట్టతలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతం...తుంగ గడ్డలు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Muthanga
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 25, 2023 | 9:55 AM

Share

మన ఆయుర్వేదంలో ప్రతి మొక్కలోను ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని కోట్లాది మొక్కల ఔషధ గుణాలు వాటి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో వివరంగా తెలిపారు. ప్రతి మొక్క లోను అందులోని పదార్థాలు వాటి లక్షణాలు అవి ఏ ఏ జబ్బులను తగ్గిస్తాయో ఆయుర్వేదంలో వివరంగా ఉంది అలాంటి ఒక అద్భుతమైన మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన పొలం గట్ల మీద ఊరి చివరన ఖాళీ ప్రదేశాల్లోనూ బంజరు స్థలాల్లోనూ కలుపు మొక్కగా పెరిగే తుంగ గడ్డి గురించి ప్రస్తుతం మనం చర్చించుకుందాం. తుంగ గడ్డి అనేది ఓ కలుపు మొక్క గా మనం భావిస్తూ ఉంటాం. ఈ తుంగ గడ్డి భూమి లోపల తుంగ గడ్డలు ఉంటాయి. వీటినే కొన్ని ప్రాంతాల్లో తుంగభటికలు తుంగమస్తలు అని పిలుస్తారు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ తుంగ గడ్డలతో ఏ ఏ వ్యాధులు నివారించవచ్చు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రస్తుతం తుంగ గడ్డలు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

తుంగ గడ్డలు జాండీస్ కు రామబాణం అనే చెప్పాలి తుంగ గడ్డలతో చేసిన కషాయం తాగితే కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది ముఖ్యంగా కాలేయంలో ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలకు ఈ తుంగ గడ్డ అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా తుంగ గడ్డలను వేడి నీటిలో మరగబెట్టిన తర్వాత ఆ నీటిని తాగితే కాలేయంలో ఇన్ఫెక్షన్ తగ్గి కామెర్లు తగ్గుముఖం పడతాయి.

అలాగే తుంగ గడ్డలను పేస్టుగా చేసి అందులో తేనె కలిపి నాకితే పేగు పూత వ్యాధి తగ్గిపోతుంది. ముఖ్యంగా అల్సర్ సంబంధిత వ్యాధులకు తుంగ గడ్డలు బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మధుమేహం తగ్గించడంలో కూడా తుంగ గడ్డలు అద్భుతంగా పనిచేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

తుంగ గడ్డలతో బట్టతలపై వెంట్రుకలు రావడం ఖాయం…

తుంగ గడ్డలు బట్టతలపై వెంట్రుకలు తిరిగి మొలిపించడంలో అద్భుతంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా తుంగ గడ్డలను ఎండబెట్టి దాన్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది, అంతేకాదు బట్టతలపై కూడా వెంట్రుకలు మొలిచేందుకు పునరుద్జీవంగా పనిచేస్తుంది. తుంగ గడ్డల ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ పొడిలో, చందనం కలిపి ముఖంపై రాసుకుంటే మొటిమలు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది అంతేకాదు నల్లటి నలుపు సైతం తొలగిపోయి మొహం చంద్రబింబంలా మెరిసిపోవడం ఖాయమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తుంగ గడ్డలు ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారిణి అని చెప్పాలి వీటి పైన ఇప్పటికీ ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా తుంగ గడ్డలు లభించినట్లయితే ఆయుర్వేద నిపుణుడి సలహాలతో వాడటం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం