Lungs Cancer: పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు.. ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమే

పొగతాగడం, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా సందర్భాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు చివరి దశలో చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.

Lungs Cancer: పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు.. ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమే
Lungs CancerImage Credit source: Prapass Pulsub/Moment/Getty Images
Follow us

|

Updated on: Sep 25, 2024 | 6:56 PM

ప్రస్తుతం రోజు రోజుకీ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2023 సంవత్సరంలో భారతదేశంలో 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు 1990లో అత్యధికంగా నమోదు కాగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు 1 లక్ష మందికి 6.62 శాతంగా ఉన్నాయి. ఈ కేసుల సంఖ్య 2019 నాటికి 7.7కి పెరిగింది. పొగతాగడం, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా సందర్భాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు చివరి దశలో చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందుగానే ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి కొంత మంది నిపుణులు పలు రకాల సూచనలు చేశారు. గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని సర్జికల్ ఆంకాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దేబాశిష్ చౌదరి ఊపిరితిత్తుల క్యాన్సర్ పై మాట్లాడుతూ ఎక్కువ రోజులు దగ్గు వస్తుంటే, ఛాతీ నొప్పి తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాసలో గురక శబ్దం వినిపిస్తుంటే అది ఊపిరితిత్తుల్లో ఇబ్బందులున్నాయని గుర్తించాలని చెప్పారు. ఈ లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ వి కావొచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించలేము. ఎందుకంటే ఈ లక్షణాలను సాధారణ సమస్యగా భావించి విస్మరిస్తున్నారు. దీని కారణంగా ఈ వ్యాధి త్వరగా త్వరగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో రోగి చివరి దశలో చికిత్స కోసం వస్తాడు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణాలు

  1. ఎక్కువగా పొగ తాగడం
  2. వాయు కాలుష్యం
  3. సిలికా, బొగ్గు ఉత్పత్తులు మొదలైన హానికరమైన పదార్ధాల మధ్య ఎక్కువ గడిపిన తర్వాత కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
  4. ధూమపానం చేసే వారితో సన్నిహితంగా ఉన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడవచ్చు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్స

ఈ క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే రోగికి సులభంగా చికిత్స అందించవచ్చు. ప్రారంభ దశలో రోగికి కీమోథెరపీతో మాత్రమే చికిత్స చేస్తారు. అయితే ఈ క్యాన్సర్ రెండవ దశలో గుర్తిస్తే ఆపరేషన్ ద్వారా కణితి భాగాన్ని తొలగిస్తారు. అంతేకాదు మూడవ దశలో కీమోథెరపీతో పాటు ఆపరేషన్, రేడియేషన్ చికిత్స ఇస్తారు. నాల్గవ దశలో రేడియేషన్, శస్త్రచికిత్స, ఇమ్యునోథెరపీతో చికిత్సను ఇస్తారు. ఈ దశలో రోగి ప్రాణాలను కాపాడటం వైద్యులకు ఒక సవాలు.

ఇవి కూడా చదవండి

ఎలా రక్షించుకోవాలంటే

  1. ధూమపానం చేయవద్దు
  2. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు
  3. ధూమపానం చేసే వ్యక్తి నుంచి దూరంగా ఉండండి.
  4. తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..