Rare Disease: సరికొత్త రూపంలో చికెన్ గున్యా.. తల్లి నుంచి పుట్టిన శిశువుకు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఏమిటంటే

గర్భిణీ తల్లి చికున్‌గున్యాతో బాధపడుతుంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భంలో గర్భం దాల్చిన చివరి రోజుల్లో తల్లి చికున్‌గున్యా బారిన పడింది. ఆ గర్భిణీ స్త్రీ ప్రసవించిన 15 రోజుల తర్వాత చిన్నారి శిశివుకు జ్వరం, ముక్కుపై నల్ల మచ్చలు రావడం ప్రారంభించిన ఉదంతం చెన్నైలో వెలుగులోకి వచ్చింది. అనంతరం చిన్నారిని స్కిన్ స్పెషలిస్టుకు చూపించారు.

Rare Disease: సరికొత్త రూపంలో చికెన్ గున్యా.. తల్లి నుంచి పుట్టిన శిశువుకు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఏమిటంటే
Black Nose DiseaseImage Credit source: David Espejo/Moment/Getty Images
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2024 | 3:26 PM

కరోనా వైరస్ తర్వాత వివిధ రకాల వైరస్ లు వెలుగులోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం అధిక వర్షపాతం కారణంగా మన దేశంలో వివిధ ప్రదేశాల్లో చికున్‌గున్యా కేసులు నమోదవుతున్నాయి. ఇది దోమ కాటు వల్ల వచ్చే జ్వరం, దీని లక్షణాలు చికెన్ డెంగ్యూని పోలి ఉంటాయి. అయితే ఈ వైరస్ బారిన పడిన బాధితులు రోగి కండరాలలో తీవ్రమైన నొప్పితో బాధపడతాడు. దోమ కాటు వల్ల వచ్చే చికున్‌గున్యా గర్భిణులకు కూడా విస్తరిస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ వైరస్ లక్షణాలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి చికున్‌గున్యా కరోనా మాదిరిగా లక్షణాలను మార్చుకుని కొత్త లక్షణాలతో వ్యాపిస్తోంది. చెన్నైలో ఓ అరుదైన వ్యాధి తెరపైకి వచ్చింది. ఓ చిన్నారి Black Nose Diseaseతో బాధపడుతోంది. దీనినే చిక్ సైన్ అని కూడా అంటారు. ఈ వ్యాధి తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు.

గర్భిణీ తల్లి చికున్‌గున్యాతో బాధపడుతుంటే దాని ప్రభావం పుట్టబోయే బిడ్డపై కూడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భంలో గర్భం దాల్చిన చివరి రోజుల్లో తల్లి చికున్‌గున్యా బారిన పడింది. ఆ గర్భిణీ స్త్రీ ప్రసవించిన 15 రోజుల తర్వాత చిన్నారి శిశివుకు జ్వరం, ముక్కుపై నల్ల మచ్చలు రావడం ప్రారంభించిన ఉదంతం చెన్నైలో వెలుగులోకి వచ్చింది. అనంతరం చిన్నారిని స్కిన్ స్పెషలిస్టుకు చూపించారు. తల్లి చికున్‌గున్యా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఈ అరుదైన చర్మవ్యాధి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మినహా చిన్నారి బాలిక పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నదని చెప్పారు. అయితే తల్లికి వచ్చిన చికున్‌గున్యా కారణంగా ఈ లక్షణాలు శిశువుకు వచ్చినట్లు చెప్పారు. దీనికి బ్లాక్ నోస్ డిసీజ్ అని పేరు పెట్టారు.

చిక్ సైన్ వ్యాధి అంటే ఏమిటంటే

ఇది ఒక రకమైన చర్మ సంబంధిత వ్యాధి అని.. ఇందులో తేలికపాటి జ్వరంతో పాటు ముక్కుపై నల్లటి మచ్చలు వస్తాయని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ చెబుతున్నారు. ఈ మచ్చలు ఎక్కువగా ముక్కు చుట్టూ ఏర్పడతాయి. చాలా మంది రోగులలో ఇది చికున్‌గున్యా జ్వరం తర్వాత లేదా దానితో పాటు వస్తుంది. స్కిన్ స్పెషలిస్ట్‌ల ప్రకారం చర్మంపై ఈ మచ్చలు 6 నెలల వరకు ఉంటాయి. అయితే సరైన ట్రీట్మెంట్ తీసుకుని తగిన మందులు తీసుకుంటే ఆ మచ్చలు త్వరగా మాయమవుతాయని చెప్పారు,

ఇవి కూడా చదవండి

చిక్ సైన్ వ్యాధి లక్షణాలు

  1. చిక్ సైన్ వ్యాధి రోగికి మొదట జ్వరంగా మొదలవుతుంది.
  2. అంతేకాదు తర్వాత విపరీతమైన రోగి కీళ్ల నొప్పులతో బాధపడతారు.
  3. అంతేకాదు కొంతమందిలో రోగికి తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్లలో వాపు వంటి లక్షణాలతో బాధపడవచ్చు.
  4. ముక్కుపై నల్ల మచ్చలు, దద్దుర్లు ఉంటాయి.
  5. రోగి కూడా విపరీతమైన అలసట కలుగుతుంది. బలహీనంగా అనిపించవచ్చు.
  6. చిక్ సైన్ వ్యాధి లక్షణాలు 15 రోజుల నుంచి 1 నెల వరకు కొనసాగుతాయి.

చిక్ సైన్ వ్యాధి నివారణ పద్ధతులు

  1. చికున్‌గున్యా సరి కొత్త వేరియంట్ చిక్ సైన్ వ్యాధి కనుక దీనిని నివారించడానికి.. చికున్‌గున్యా రాకుండా ఎటుంటి రక్షణ పద్దతులు పాటిస్తారో అటువంటి పద్దతులే పాటించాలి.
  2. కనుక ఈ జ్వరం రాకుండా ఉండాలంటే దోమల బెడద నుంచి కాపాడుకోవాలి.
  3. అందువల్ల ఇంటి పరిసరాల చుట్టూ నీరు పేరుకుపోకుండా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
  4. ఒకవేళ జ్వరం వచ్చినట్లయితే వెంటనే రక్త పరీక్ష చేయించుకోండి.
  5. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు నీటిలో కిరోసిన్ ఆయిల్ లేదా మందు పిచికారీ చేయాలి.
  6. దోమల నుంచి రక్షణ కోసం ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి.
  7. తినే ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎక్కువ ద్రవ ఆహారం తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..