Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజున ఏర్పడనున్న యాదృచ్ఛిక సమయంలో పూజ చేయండి.. ఆగిన పనులు కూడా ప్రారంభం అవుతాయి.

పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిధి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మర్నాడు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకొనున్నారు. ఈ రోజున ఉదయం 7.42 నుంచి 09.12 గంటల వరకు పూజలకు అనుకూలం.

Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజున ఏర్పడనున్న యాదృచ్ఛిక సమయంలో పూజ చేయండి.. ఆగిన పనులు కూడా ప్రారంభం అవుతాయి.
Indira Ekadashi 2024
Follow us

|

Updated on: Sep 25, 2024 | 2:52 PM

హిందూ మతంలో ఇందిరా ఏకాదశి తిధి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు, పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను విజయవంతం పూర్తి చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాది ఇందిరా ఏకాదశి తిధి పితృ పక్ష సమయంలో వచ్చింది. ఈ సమయంలో ఈ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణింపబడుతుంది. ఈ రోజున చేసే పూజ విష్ణువుతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.

ఇందిరా ఏకాదశి తిధి, సమయం, శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిధి భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 1:20 గంటలకు ప్రారంభమై మర్నాడు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 2:49 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 28వ తేదీ శనివారం జరుపుకొనున్నారు. ఈ రోజున ఉదయం 7.42 నుంచి 09.12 గంటల వరకు పూజలకు అనుకూలం.

ఇందిరా ఏకాదశి రోజున శుభ యాదృచ్చికాలు

ఈ ఏడాది ఇందిరా ఏకాదశి రోజున ప్రత్యేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగంతో పాటు, శివస్ వంటి శుభ యోగం కూడా ఏర్పడుతున్నాయి. దీని కారణంగా ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.52 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయం. ఇందిరా ఏకాదశి పూజను సెప్టెంబర్ 29 ఉదయం 06:13 నుండి 08:36 వరకు జరుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇందిరా ఏకాదశి పూజా విధానం:

  1. ఇందిరా ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అందుచేత ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.
  2. ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా బొమ్మను ప్రతిష్టించి, పూజా గదిని పువ్వులు, దీపాలతో అలంకరించండి.
  3. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కావున తులసి మొక్కకు నీరు సమర్పించి ధూపం వేయండి.
  4. ఉపవాస ఉంటానని తీర్మానం చెప్పుకుని తన మనసులోని కోరికలను నెరవేర్చమని విష్ణువును ప్రార్థించండి.
  5. విష్ణు సహస్త్రనామం పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
  6. శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్ర నామాలను పఠించండి
  7. ఇందిరా ఏకాదశి కథ వింటే మనసుకు ప్రశాంతత లభించి పుణ్యం లభిస్తుంది.
  8. ఈ రోజున పండ్లు తినండి. పండ్లు, కూరగాయలు, పెరుగు తినవచ్చు. ఈ రోజున పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది.
  9. ఈ ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. భజన కీర్తనలు చేయవచ్చు లేదా విష్ణువు కథను వినవచ్చు.

ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే

హిందూ మతంలో ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందిరా ఏకాదశి తిధి రోజున ఉపవాసం ఉండటం, శ్రీ మహా విష్ణువును ఆరాధించడం ద్వారా ప్రజలలోని అన్ని దుఃఖాలు పోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. దీనితో పాటు ఇందిరా ఏకాదశి సందర్భంగా పూర్వీకుల పేరిట దానధర్మాలు చేయడం వల్ల పూర్వీకులు మోక్షప్రాప్తి పొందుతారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజలు చేయడం వల్ల ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలోని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి