Navaratri 2024: నవరాత్రులలో కలశాన్ని స్థాపించడానికి శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి..
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీన 00:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.
హిందూ మతంలో దేవీ నవరాత్రుల్లో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టించడం ద్వారా నవరాత్రి దుర్గ దేవి పూజను ప్రారంభిస్తారు. దుర్గా దేవి కలశంలో నివసిస్తుందని.. తొమ్మిది రోజులు పూజించబడుతుందని నమ్ముతారు. శరన్నవరాత్రుల్లో కలశ స్థాపనకు పవిత్రమైన సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు లేదా పూజ పూర్తి ఫలితం దక్కదు అని నమ్మకం. కనుక నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్టిస్తారు.
కలశ స్థాపనకు అనుకూలమైన సమయం
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3వ తేదీన 00:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి అక్టోబర్ 4వ తేదీ ఉదయం 02:58 వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ఆధారంగా ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కానున్నాయి.
కలశ ప్రతిష్టాపన శుభ సమయం
శారదీయ నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు రెండు శుభ ముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ సమయం ఉదయం 6.15నుంచి 7.22 వరకు ఉంటుంది. ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం ఒక గంట 6 నిమిషాల సమయం ఉంది.
అంతే కాకుండా మధ్యాహ్నం కలశ స్థాపన సమయం కూడా అభిజీత్ ముహూర్తంలోనే ఉంది. ఇది ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. మధ్యాహ్నం 11:46 నుండి 12:33 వరకు ఏ సమయంలోనైనా కలశాన్ని స్థాపించవచ్చు. మధ్యాహ్నం కలశ స్థాపన కు 47 నిమిషాల శుభ సమయం లభిస్తుంది.
కలశ ప్రతిష్టాపన విధానం, పద్ధతి
కలశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభ్రమైన, పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోండి. ఈ స్థలం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకుని బియ్యం, గోధుమలు, బార్లీ, శనగలు, నాణేలు, గంగాజలం, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి మామిడి ఆకులు పెట్టి దాని పైన కొబ్బరికాయను ఉంచాలి. కలశాన్ని పసుపు, కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చండి. పసుపు, బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించండి. అమ్మవారి మంత్రాలను జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వెలిగించండి.
కలశ ప్రతిష్టాపనకు నియమాలు
నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉండండి. కలశ స్థాపన సమయంలో మనస్సులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు. మొత్తం నవరాత్రులలో నియమ నిష్టల ప్రకారం కలశాన్ని పూజించండి. దేవీ నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలశాన్ని పీటం నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి