AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రొయ్యలు వీరికి యమ డేంజర్.. తింటే ప్రాణాలకే రిస్క్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. మరీ ముఖ్యంగా సీఫుడ్ ప్రియులకు రొయ్యల వేపుడు లేదా రొయ్యల కూర కనిపిస్తే ఆ గుమగుమలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే అందరికీ రొయ్యలు అమృతం కావు. కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు రొయ్యలను తింటే, అది శరీరంలో విషంగా మారి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Apr 26, 2026 | 4:01 PM

Share
కీళ్ల నొప్పులు - యూరిక్ యాసిడ్: కీళ్ల నొప్పులతో బాధపడేవారు రొయ్యలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. రొయ్యలలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో జీర్ణమైనప్పుడు యూరిక్ యాసిడ్‌గా మారుతాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగితే అది కీళ్ల మధ్య స్ఫటికాలుగా పేరుకుపోయి తీవ్రమైన నొప్పిని, వాపును కలిగిస్తుంది. దీన్నే గౌట్ అంటారు. రొయ్యలు తిన్న మరుసటి రోజే కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

1 / 5
కిడ్నీ వ్యాధులు - థైరాయిడ్ హెచ్చుతగ్గులు: రొయ్యలలో సోడియం మరియు పొటాషియం నిల్వలు ఎక్కువ. మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఈ ఖనిజాలను ఫిల్టర్ చేయలేరు. దీనివల్ల కిడ్నీలపై అదనపు భారం పడి పరిస్థితి విషమిస్తుంది. సముద్రపు ఆహారంలో అయోడిన్ నిల్వలు సహజంగానే ఎక్కువ. థైరాయిడ్ మందులు వాడుతున్న వారు రొయ్యలు ఎక్కువగా తీసుకుంటే, అయోడిన్ మోతాదు పెరిగి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది.

2 / 5
అలెర్జీలు: చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు. ముఖ్యంగా సీఫుడ్ అలెర్జీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణం. రొయ్యలు తిన్న కొన్ని నిమిషాల్లోనే చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, పెదవులు లేదా కళ్ళు వాచడం వంటివి జరిగితే అది అలెర్జీకి సంకేతం. ఇది తీవ్రమైతే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, రక్తపోటు పడిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో అనాఫిలాక్సిస్ అంటారు. సకాలంలో చికిత్స అందకపోతే ఇది ప్రాణాపాయానికి దారితీస్తుంది

3 / 5
గుండె సమస్యలు - అధిక కొలెస్ట్రాల్: రొయ్యలలో కొలెస్ట్రాల్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు రొయ్యలను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది చివరికి గుండెపోటుకు దారితీయవచ్చు.

4 / 5
వండే ముందు ఈ జాగ్రత్త తప్పనిసరి: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రొయ్యలను వండేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోకూడదు. రొయ్య వెనుక భాగంలో ఉండే నల్లటి నరాన్ని కచ్చితంగా తీసివేయాలి. అది రొయ్య యొక్క విసర్జక పదార్థం. దాన్ని క్లీన్ చేయకుండా తింటే జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా ఆరోగ్యానికి మంచిదే కదా అని అతిగా తినడం ఏ ఆహారమైనా ప్రమాదకరమే.

5 / 5
Follow Us