AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divyabharathi: జిమ్ములు, గిమ్ములు లేవు.. నా ఫిట్‌నెస్‌కు కారణం ఇదే అంటున్న హాట్ బ్యూటీ దివ్య భారతి

ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి, బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు చేసింది రెండే రెండు సినిమాలు.. కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అలాగే తన వ్యక్తిగత అనుభవాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Rajeev Rayala
|

Updated on: Apr 26, 2026 | 12:19 PM

Share
ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది హాట్ బ్యూటీ దివ్య భారతి, బ్యాచిలర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు చేసింది రెండే రెండు సినిమాలు.. కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అలాగే తన వ్యక్తిగత అనుభవాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ఏమనుకున్నానో పరిశ్రమ, ప్రజల నుంచి అదే ఆదరణ లభించిందని, ఎటువంటి తేడా లేదని దివ్య భారతి తెలిపింది

1 / 5
తెలుగు ప్రేక్షకులు చాలా మంచి మనసు గలవారని, చేసిన పనికి ప్రేమను ఇస్తారని, వారికి మంచి పనిని అందిస్తే అపారమైన ప్రేమను కురిపిస్తారని తెలిపింది. బ్యాచిలర్ సినిమాలోని ఆదియే పాటకు అసాధారణమైన ఆదరణ లభించిందని, భాష తెలియని వారు కూడా దేశవ్యాప్తంగా, విదేశాలలో దీనిని ఆదరించడం తనను ఆశ్చర్యపరిచిందని దివ్య భారతి తెలిపారు. G.O.A.T. చిత్రం నుండి అయ్యో పాపం సారూ అలాగే ఓడి అమ్మ పాటలు తనకు ఇష్టమైనవని, ఇంకా విడుదల కాని ఒక విషాద గీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది.

2 / 5
ఆమె ఫిట్‌నెస్ గురించి అడగ్గా, తాను ఫిట్‌నెస్ ఫ్రీక్ కాదని, తన సన్నటి శరీరం జన్యుపరమైనదని స్పష్టం చేశారు. తాను వ్యాయామం చేయలేదని, బరువు పెరగడం కూడా కష్టమని తెలిపింది. అయితే, కథ డిమాండ్ చేస్తే, బలమైన స్క్రిప్ట్ ఉంటే శారీరక మార్పులకు సిద్ధమని తెలిపింది. తల్లి సెంటిమెంట్ కారణంగా జుట్టు కత్తిరించుకోవడానికి నిరాకరించానని, తన తల్లి తన పొడవాటి జుట్టును ఇష్టపడతారని తెలిపింది. ఆహార అలవాట్ల విషయానికి వస్తే, తాను ఎప్పుడూ ఆకలితో ఉండనని, మితంగా అన్ని రకాల ఆహార పదార్థాలను తింటానని పేర్కొంది. ప్రస్తుతం డైట్ పాటిస్తున్నానని, వర్కవుట్ చేయనప్పుడు ఆహారంపై దృష్టి పెట్టడం అవసరమని చెప్పుకొచ్చింది. 

3 / 5
సుడిగాలి సుధీర్‌తో కలిసి G.O.A.T. చిత్రీకరణ అనుభవాన్ని పంచుకుంటూ, సినిమా మొత్తం చాలా సరదాగా ఉంటుందని తెలిపింది. అప్పట్లో తనకు తెలుగు అంతగా తెలియదని, కానీ సెట్‌లో అందరూ సరదాగా, స్నేహపూర్వకంగా ఉండేవారని, కొత్త పరిశ్రమ అనే భావన ఎప్పుడూ కలగలేదని చెప్పుకొచ్చింది. షూటింగ్ ఎక్కువగా హైదరాబాద్‌లో, కొన్ని సన్నివేశాలు గ్రామీణ ప్రాంతంలో జరిగాయని, ప్రాంతీయ ఆహార పదార్థాల కారం తనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, విభిన్న సంస్కృతి, ఆహారం, వస్త్రధారణను ప్రయత్నించడం ఆనందంగా ఉందని తెలిపింది.

4 / 5
పాత్రల ఎంపికపై మాట్లాడుతూ.. భావోద్వేగ సన్నివేశాలు తనకు చాలా ఇష్టమని, బోల్డ్ స్టైల్ కూడా తన స్వభావానికి సరిపోతుందని తెలిపింది. తనకు రొమాన్స్, కామెడీ ఎంతవరకు వస్తాయో తెలియదని, ప్రస్తుతం G.O.A.T.లో కామెడీని ప్రయత్నిస్తున్నానని తెలిపింది. భవిష్యత్తులో యాక్షన్ , బలమైన భావోద్వేగ పాత్రలు చేయాలని కోరుకుంటున్నా అని తెలిపింది. తన పేరు దివ్య భారతి వెనుక ఉన్న కథను వివరిస్తూ, తన తల్లి ప్రముఖ దివంగత నటి దివ్య భారతి పేరు మీద తనకు ఆ పేరు పెట్టారని, ఆమె ఎంత అందంగా ఉండేవారో తనకు తెలుసని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్