AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tour: వేసవి సెలవుల్లో టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా? ఈ 5 చల్లని ప్రదేశాలకు వెళ్లండి.. మన దేశంలోనే ఉన్నాయ్‌..

పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. సుదీర్ఘమైన ఈ సెలవుల్లో చాలా మంది టూర్‌లు ప్లాన్‌ చేస్తుంటారు. వేసవి వేడిలో మన దేశంలోని ఈ 7 చల్లని ప్రదేశాలు టూర్‌కు బెస్ట్‌ ఆప్షన్లు. ఇందులో మొదటి వరుసలో నిలిచేది హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి..

Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 3:25 PM

Share
భారతదేశంలోని అత్యంత ఇష్టమైన వేసవి విహార ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి ఒకటి. ఇక్కడ మే నెలలో కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎత్తైన పర్వతాలపై మంచు కూడా చూడవచ్చు. మనాలి పర్వతాలు, లోయలు, పారే నదులతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, ట్రెకింగ్‌ కూడా చేయవచ్చు.

1 / 5
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ పీఠభూమి మరో అద్భుత టూరిస్ట్‌ ప్లేస్‌. ఇది చల్లని గాలి, స్ట్రాబెర్రీ పొలాలు, అందమైన ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి మే నెల చల్లని వాతావరణం వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. వేడితో అలసిపోయిన వారికి ఇక్కడి చల్లని ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి.

2 / 5
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ తేయాకు తోటలకు ప్రసిద్ధి. ముఖ్యంగా మే నెలలో కాంచన్‌జంగా ప్రదేశం వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మినీ రైలులో ప్రయాణించి సూర్యోదయాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. తమిళనాడులోని ఊటీ.. కొండ ప్రాంతాల రాణి అని పిలుస్తారు. ఇక్కడి పూల తోటలు, మే నెలలో వీచే చల్లని గాలులు మనసును మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి సరస్సులు, వ్యూ పాయింట్లు భలేగా ఉంటాయి.

3 / 5
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న అందమైన సరస్సులు, పచ్చని కొండలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ మే నెలలో కూడా వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. నైని సరస్సులో బోటింగ్, చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రకృతి సోయగాలు కనులకు విందు చేస్తాయి.

4 / 5
మే నెలలో లేహ్-లడఖ్ పర్యాటకులకు ఒక స్వర్గధామం. సాహస ప్రియులకు ఇదొక కలల గమ్యస్థానం. ఇక్కడి పర్వతాలు, నీలాకాశం, విశిష్టమైన ప్రకృతి దృశ్యాలు దీనిని ప్రత్యేకంగా నిలుపుతాయి. రోడ్ ట్రిప్‌లు, బైక్ రైడ్‌లు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

5 / 5
Follow Us