AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Cravings: మీకెప్పుడైనా అర్ధరాత్రి ఆకలి అనిపించిందా? ఇది దేనికి సంకేతమో తెలుసా

అర్ధరాత్రి ఒక్కోసారి విపరీతమైన ఆకలి వేస్తుంది. దీంతో చాలా మంది ఇంట్లో ఏవైనా స్నాక్స్ ఉంటే తిని నిద్రపోతుంటారు. ఇది సాధారణమని భావించి నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ జరిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ దీనికి కారణం ఏమిటి? ఇది అనారోగ్య సంకేతమా? నిద్రకూ ఆకలికీ మధ్య సంబంధం ఏమిటి? ఇలా ఎందుకు

Food Cravings: మీకెప్పుడైనా అర్ధరాత్రి ఆకలి అనిపించిందా? ఇది దేనికి సంకేతమో తెలుసా
Late Night Craving
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 2:59 PM

Share

కొంతమంది పగలు మూడు పూటలా వేళకు భోజనం చేసినా రాత్రిపూట మాత్రం తరచుగా ఆకలిగా అనిపిస్తుంటుంది. అర్ధరాత్రి నిద్రలేచి ఏదైనా తినాలనిపించడం ఒక్కోసారి జరుగుతుంది. ఇది సాధారణమని భావించి నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ జరిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ దీనికి కారణం ఏమిటి? ఇది అనారోగ్య సంకేతమా? నిద్రకూ ఆకలికీ మధ్య సంబంధం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం…

అర్ధరాత్రి ఆకలికి కారణం ఏమిటి?

రాత్రిపూట ఆకలిగా అనిపించడం అనేది శరీరానికి ఎక్కువ శక్తి అవసరమని సూచించే ఒక సంకేతం. ఇది సాధారణమే అయినప్పటికీ దీనికి ఒక కారణం ఉందని డాక్టర్ దీపక్ కుమార్ అంటున్నారు. మెదడు శరీరానికి ఆకలి సంకేతాలను పంపుతుంది. దీనివల్ల రాత్రిపూట కూడా తినాలని శరీరానికి అనిపిస్తుంది.

ఇది ఏదైనా వ్యాధి లక్షణమా?

కొన్ని సందర్భాల్లో దీనిని ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ అనే సమస్యగా పరిగణించవచ్చు. ఈ పరిస్థితిలో రాత్రిపూట ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. దీంతో ఏదైనా తినడానికి పదేపదే నిద్రలేస్తుంటారు. కానీ ఇది ప్రతిరోజూ జరిగితేనే సమస్యగా పరిగణిస్తారు. ఇది వారానికి ఒకటి లేదా రెండుసార్లు జరిగితే సమస్య అవుతుందని అంటారు.

ఇవి కూడా చదవండి

నిద్ర – ఆకలి మధ్య సంబంధం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారు నిద్రలేమి సమస్యతో బాధపడతారు. దీనివల్ల ‘గ్రెలిన్’ అనే హార్మోన్ స్థాయి పెరిగి, ఆకలి అధికమవుతుంది. అందువల్ల, రాత్రిపూట తరచుగా ఆకలి వేస్తుంది. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే అధిక బరువు, జీవక్రియ సమస్యలు, కాలేయ వ్యాధులకు దారితీయవచ్చు. అందువల్ల దీనిని సకాలంలో నియంత్రించడం చాలా ముఖ్యం.

ఎలా నియంత్రించాలి?

  • రోజుకు 3 నుండి 4 సార్లు సమతుల్య భోజనం చేయాలి.
  • రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలి.
  • ఆలస్యంగా నిద్రలేచే అలవాటును మానుకోవాలి.
  • ఒత్తిడిని నియంత్రించాలి.
  • సమస్య ఇలానే అధికా రోజులు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర పూర్తి వివరాలకు వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us