AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన

భగ్గుమంటున్న భారత్‌..ఏపీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణకు వర్ష సూచన

Samatha J
|

Updated on: Apr 26, 2026 | 1:08 PM

Share

దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఏప్రిల్‌ నెల ముగుస్తోంది.. మే నెల రాబోతోంది. ఏప్రిల్‌ ఎండింగ్‌లోనే ఎండ తీవ్రత దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు తేలికపాటి వర్షాలు.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణం విచిత్రంగా మారింది.

తెలంగాణలో వాతావరణం మిశ్రమంగా ఉంది. ఓ వైపు తేలికపాటి వర్షాలు, మరోవైపు తీవ్రరూపం దాల్చుతున్న ఎండలతో రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉంది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా.. ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వర్షాలు కురిసినప్పటికీ.. మంగళవారం నుంచి తెలంగాణలో వాతావరణం పొడిగా మారుతుంది. మంగళవారం నుంచి గురువారం వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. ఎండ తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండ తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాతావరణ శాఖ ఏపీవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటనున్నాయని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.: ఏపీలోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, మరో 28 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

Follow Us