డేంజర్‌లో ప్రపంచం.. భారత్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా వాతావరణం సంక్షోభంలో పడింది. అధిక రెట్లు పెరిగి అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూతాపం, వాతావరణ మార్పులతో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక మన దేశం భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎక్కువగా ప్రకృతి విపత్తులకు గురవుతోంది. వరదలు, తుపాన్లు, వడగాలులు, భూకంపాలు, కరవు, కొండచరియలు విరిగిపడటం వంటి వాటితో దేశం ప్రభావితమవుతోంది. కాలచక్రంలో వెనక్కు వెళ్లామనుకోండి.. అంకెలతో సహా సీన్ మీ కళ్లముందుంటుంది.
1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల జాబితాను జర్మన్ వాచ్ క్లైమేట్ రిస్క్‌లో చేర్చింది. అందులో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. 1995-2024 మధ్య ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రభావిత దేశాలను రెండు గ్రూపులుగా విడదీసారు. ప్రకృతి వైపరీత్యాలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతున్న జాబితాలో భారత్‌ను చేర్చారు. గత మూడు దశాబ్దాల్లో దేశంలో 430కి పైగా ఇలాంటి దారుణ ఘటనలను ఫేస్ చేయాల్సి వచ్చింది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు మధ్యదరా సముద్రం నుంచి మధ్య ఆసియా దేశాల మీదుగా ఉత్తర భారతంపైకి, అటు నుంచి టిబెట్ మీదుగా వీస్తుంటాయి. అయితే గడచిన కొన్ని రోజులుగా వెస్ట్రన్ డిస్ట్రబెన్స్‌లు ప్రభావం చూపకపోవడంతో ఉత్తర, మధ్యభారతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉత్తర, మధ్య, తూర్పుభారతంలో ఎండలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావంతో దక్షిణాదిలోనూ వడగాడ్పులు కొనసాగుతున్నాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. గడచిన వారం, పది రోజుల నుంచి ఉత్తరార్ధ గోళంలోని సముద్ర ఉపరితలం వేగంగా వేడెక్కుతోందన్నారు. భూమధ్యరేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేగంగా వేడెక్కడం అసాధారణమేనని విశ్లేషించారు. దీంతో భూమధ్యరేఖకు ఆనుకుని గాలులు దాదాపు నిలిచిపోయాయని, అందుకే భారత ఉపఖండంపైకి చల్లని గాలులు రావడం లేదన్నారు. దేశంపైకి సముద్రాల నుంచి తేమగాలుల రాక తగ్గినట్టు తెలిపారు. సాధారణంగా బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వీచే తేమగాలులతో తీరప్రాంతాలు చల్లగా ఉంటాయని, కొండ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటాయని, అయితే ఈ ఏడాది అటువంటి వాతావరణం లేకపోవడంతో సుదీర్ఘంగా ఎండలు కొనసాగుతున్నాయన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్
డేంజర్‌లో ప్రపంచం.. భారత్ పరిస్థితి ఏమిటి?
భగ్గుమంటున్న భారత్..ఏపీకి రెడ్ అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన
చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..
ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు
దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా
అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు
మోమోస్ తిన్న బాలికకులివర్ డ్యామేజ్.. చివరకు..!
కస్టమర్ కు రూ.3.21 లక్షల.. పరిహారాన్ని చెల్లించిన బ్యాంక్ !!
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్
కాంగ్రెస్ పార్టీ వీడడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన..
బీఆర్ఎస్లో చేరికపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
కేసీఆర్ చేసిందే కరెక్ట్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై TV9 క్రాస్ ఫైర్

