Eye Care Tips: పిల్లల కంటి నుంచి నీరు వస్తూనే ఉందా.. ఈ అలవాటు తగ్గించండి..

మొబైల్ ఫోన్ కు ఎంతగా అలవాటు అయ్యారంటే.. ఒక్క నిమిషం కూడా ఫోన్‌కు దూరంగా ఉండలేని స్థితిలో పిల్లలు మొబైల్ ఫోన్‌లకు అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా సెల్ ఫోన్ ను ఎక్కువ చూడడం వలన పిల్లల కళ్లపై ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల పిల్లలు కళ్లలో నీళ్లు కారడం, కళ్లు పొడిబారడం, కళ్లు ఎర్రబడడం, అలసట, చూపు మందగించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లకు కనెక్ట్ అయి ఉంటారు.

Eye Care Tips: పిల్లల కంటి నుంచి నీరు వస్తూనే ఉందా.. ఈ అలవాటు తగ్గించండి..
Eye Care Tips
Follow us

|

Updated on: Sep 25, 2024 | 7:29 PM

ప్రస్తుతం పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా గంటల తరబడి సెల్ ఫోన్లను చూస్తున్నారు. ఇది ఒక్క ఇంట్లో జరగడం లేదు.. ప్రతి ఇంట్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సమయం సందర్భం లేకుండా గంటల తరబడి మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ కు ఎంతగా అలవాటు అయ్యారంటే.. ఒక్క నిమిషం కూడా ఫోన్‌కు దూరంగా ఉండలేని స్థితిలో పిల్లలు మొబైల్ ఫోన్‌లకు అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా సెల్ ఫోన్ ను ఎక్కువ చూడడం వలన పిల్లల కళ్లపై ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల పిల్లలు కళ్లలో నీళ్లు కారడం, కళ్లు పొడిబారడం, కళ్లు ఎర్రబడడం, అలసట, చూపు మందగించడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్ తరగతుల కారణంగా పిల్లలు మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లకు కనెక్ట్ అయి ఉంటారు.

అయితే ఇలా ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల పిల్లల కళ్ళు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. పిల్లలు కంటి ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా పిల్లలు పొడి కళ్ళు, తలనొప్పి, చూపు మందగించడం, అస్పష్టమైన దృష్టికి సంబందించిన ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో తరచుగా పిల్లలు అనవసరంగా కళ్లను రుద్దడం వంటివి చేస్తున్నారు. కళ్లలో నీళ్లు కారడం, కంటి నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే కంటికి అలసట వల్ల ఇలా జరుగుతోందని అర్థం చేసుకోవాలి. గంటల తరబడి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చూడటం వల్ల సంభవించే కంటి అలసట కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు.

కంటి ఒత్తిడి అంటే ఏమిటంటే

స్క్రీన్‌పై ఎక్కువసేపు చూడటం వల్ల కంటికి కలిగే ఇబ్బందిని కంటి ఒత్తిడి అంటారు. దీని లక్షణాలు ఒక రోజులో కనిపించవు. గంటల తరబడి నిరంతరం స్క్రీన్‌పై చూడటం ద్వారా కంటి ఒత్తిడి పెరుగుతుంది. ఈ లక్షణాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకోకపోతే.. లక్షణాలు మరింత తీవ్రంగా మారవచ్చు, చూపు మందగించి అన్నీ అస్పష్టంగా కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

కంటి ఒత్తిడికి కారణాలు

  1. కంటి ఒత్తిడికి ప్రధాన కారణం గంటల తరబడి స్క్రీన్‌ని దగ్గరగా చూడటం. ఇలా ఒక రోజు చూడడం వలన ఒక రోజులోనో కంటి ఒత్తిడి కలుగదు. చాలా రోజులు నిరంతరం చూడటం ద్వారా కంటి ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది.
  2. తక్కువ వెలుతురులో ఏదైనా స్క్రీన్‌ని చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి ఏర్పడుతుంది, పిల్లలు చీకటిలో మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూసినప్పుడు అది వారి కళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
  3. అంతేకాదు కంటి ఒత్తిడి చాలా కాలం పాటు రాంగ్ నంబర్ అద్దాలు ధరించడం వల్ల కూడా జరుగుతుంది, దృష్టికి సంబంధించిన నంబర్ మారినప్పటికీ .. అద్దాలను మార్చకపోయినా కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ కంటి చూపు మందగిస్తుంది.
  4. కంటి ఒత్తిడి సమస్య ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా సంభవించవచ్చు.. ఈ ఆరోగ్య సమస్యల్లో ఒకటి డ్రై ఐ సిండ్రోమ్. అటువంటి పరిస్థితిలో పొడి కళ్ళుకు తగిన విధంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

కంటి ఒత్తిడి లక్షణాలు

  1. కళ్ళు ఎర్రగా మారడం
  2. కంటి నుంచి నీరు కారడం
  3. కళ్లలో మంట, దురద
  4. కనురెప్పలు బరువుగా మారడం
  5. తలనొప్పితో ఇబ్బంది పడడం
  6. కళ్ళు పొడిబారడం
  7. దృష్టిని ఫోకస్ చేయడంలో ఇబ్బంది
  8. ప్రకాశవంతమైన కాంతిలో కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లు ఫీలింగ్

కంటి ఒత్తిడి నివారణ మార్గాలు

కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 సూత్రాన్ని అనుసరించండి. ఈ ఫార్ములా ప్రకారం ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో చూడండి. మీ మొబైల్ లైటింగ్, స్క్రీన్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకోండి. తద్వారా కళ్ళపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. అలాగే అవసరమైతే పిల్లలు ధరించే కంటి అద్దాల సంఖ్యను నిర్ణీత సమయంలో తనిఖీ చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..