ఓర్నాయనో.. తక్కువ తిన్నా ముప్పే.. శరీరంలో సోడియం తక్కువైతే ఆ వ్యాధుల బారిన పడినట్లే..

ఉప్పు.. ముప్పు అంటూ పేర్కొంటుంటారు.. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.. అయితే.. తక్కువ ఉప్పు తీసుకున్నా హాని కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు తక్కువగా తినడం ఆరోగ్యానికి ఎలా హానికలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి..

ఓర్నాయనో.. తక్కువ తిన్నా ముప్పే.. శరీరంలో సోడియం తక్కువైతే ఆ వ్యాధుల బారిన పడినట్లే..
How Much Salt[1]
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2024 | 8:47 AM

ఉప్పు తక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది.. ఇది మనందరికీ తెలుసు.. అయితే ఉప్పు తక్కువగా తినడం కూడా మీ ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా?.. అవును.. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు తక్కువ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. తక్కువ సోడియం స్థాయిలు గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి, చిత్తవైకల్యం ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి తక్కువ ఉప్పు తీసుకోకూడదని, ఇది మధుమేహం, కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను పెంచుతుందని పేర్కొంటున్నారు.

చాలామందిలో ఉప్పు అనారోగ్యకరమనే నమ్మకం ఉంది.. ఈ విషయాన్ని పదే పదే వింటుంటాం.. అయితే, ఉప్పు వినియోగం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయని పేర్కొంటున్నారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పెద్దలు రోజుకు 2000 mg కంటే తక్కువ సోడియం (సుమారు 5 గ్రాముల ఉప్పు – ఒక టీస్పూన్ కంటే కొంచెం తక్కువ) తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

ఉప్పు తక్కువగా తీసుకునే ఆరోగ్యవంతుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ముప్పు పెరుగుతుందని.. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. దీనితో పాటు, ఉప్పు లేకపోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, LDL కొలెస్ట్రాల్ స్థాయిని కూడా పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి సోడియం ఎందుకు ముఖ్యమైనది?

మెదడు, నరాలు, కండరాలు సక్రమంగా పనిచేయడానికి సోడియం తగినంతగా తీసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ సోడియం తీసుకునే వ్యక్తులు బలహీనత, అలసట, మైకము, కోమా, మూర్ఛలు, తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా గురయ్యే ప్రమాదం ఉంది.

అయితే కొందరిలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.. దీనిని ‘సాల్ట్ సెన్సిటివ్ హైపర్ టెన్షన్’ అంటారు. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారిలో 50 శాతం మంది.. సాధారణ జనాభాలో 25 శాతం మంది ఉప్పు-సెన్సిటివ్‌గా ఉండవచ్చని, వారు ఉప్పు తీసుకోవడం నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఉప్పు-సున్నితత్వం ఎక్కువగా మహిళలు, వృద్ధులు, ఊబకాయులు – మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులలో కనిపిస్తుంది.

ఆరోగ్యవంతమైన వ్యక్తులు (సాధారణ మూత్రపిండాల పనితీరు ఉన్నవారు) సాధారణంగా తీసుకునేంత ఉప్పును తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఉప్పు-నియంత్రిత ఆహారంలో ఉన్న వ్యక్తులు సోడియం లోపం సంకేతాలు – లక్షణాలను పర్యవేక్షించాలని సూచిస్తున్నారు.

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

ఉప్పు ఆరోగ్యకరమైనప్పటికి అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కలుగుతాయి. అధిక సోడియం రక్తనాళాలను సంకోచింపజేస్తుంది.. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. హై బ్లడ్ ప్రెషర్ గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచి, మూత్రపిండాల వైఫల్యం, వ్యాధికి దారితీస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా...?
ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా...?
రాగి ఉంగరాలు ధరిస్తే ఎంత మంచిదో.. తెలిస్తే అవ్వాక్కైపోతారు!
రాగి ఉంగరాలు ధరిస్తే ఎంత మంచిదో.. తెలిస్తే అవ్వాక్కైపోతారు!
శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. అండగా ఉంటామని భరోసా
శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్.. అండగా ఉంటామని భరోసా