మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా..? వామ్మో.. కిడ్నీలు షెడ్డుకు వెళ్లినట్లే..
చాలా మంది రోజువారీ పనుల్లో ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు.. వారు మూత్ర విసర్జన చేయాలని అనిపించినప్పుడు కూడా.. మూత్రాన్ని పోయరు.. అంతేకాకుండా దాన్ని ఎక్కువసేపు ఆపుకుని.. బిగపట్టుకోని మరి కుర్చుంటారు.. ఈ అలవాటు మామూలుగా అనిపించవచ్చు.. కానీ అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉరుకులు.. పరుగుల జీవిత.. చాలా మంది రోజువారీ పనిలో చాలా బిజీగా ఉంటారు.. మూత్ర విసర్జన చేయాలని అనిపించినప్పుడు కూడా.. కొందరు పనిమీద ధ్యాసతో మూత్రాన్ని బిగ పట్టుకుంటారు. సమయానికి మూత్రం పోయరు.. ఇలా సందర్భాల్లో మూత్రం వచ్చినా.. పోయకుండా చాలా సేపు అలానే ఉంటుంటారు.. ఈ అలవాటు మామూలుగా అనిపించవచ్చు.. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రాన్ని బిగ పట్టుకుని కూర్చోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఆహారం లేదా నీరు తీసుకుంటుంటాం.. దాని కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే సకాలంలో మన శరీరం మూత్రాన్ని సకాలంలో తొలగించడం చాలా ముఖ్యం.. ఎందుకంటే ఇది శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. అందుకే.. మూత్ర పిండాల విధిని మనం అడ్డుకోవడం వల్ల అంటే.. మూత్రాన్ని బిగపట్టి కూర్చొవడం వల్ల తీవ్రమైన సమస్యగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు ప్రమాదంలో పడతాయని.. పలు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకోండి..
UTI ప్రమాదం: మూత్రాన్ని పట్టుకుని కూర్చోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.. ఇది ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. తరచుగా యుటిఐల వల్ల కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి.
మూత్రాశయ సామర్థ్యంపై ప్రభావం: మూత్రాన్ని పదే పదే ఆపడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి. దీని కారణంగా, దాని సామర్థ్యం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.. దీని కారణంగా తరువాత మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వదు.. ఇది మూత్రవిసర్జన సమయంలో మంట – నొప్పిని కూడా కలిగిస్తుంది.
మూత్రపిండాలపై ఒత్తిడి: మూత్రాన్ని బిగపట్టుకుని కూర్చోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇలా ఎక్కువ సేపు చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
మూత్రాశయంలో వాపు: మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయంలో వాపు ఏర్పడుతుంది. ఇది మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట – అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్, వాపు కూడా మూత్రపిండాలకు చేరి.. తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
మూత్ర విసర్జన – కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు
మూత్రవిసర్జన సంకేతాలు ఉంటే, దానిని ఆపకుండా వెంటనే బాత్రూమ్ కు వెళ్లండి.. పని మధ్య దీనికోసం సమయాన్ని వెచ్చించండి.. మీ మూత్రాశయంలో మూత్రాన్ని ఎక్కువసేపు ఉంచవద్దు. మీరు ఎక్కువ సేపు ప్రయాణం చేస్తుంటే, బాత్‌రూమ్ సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయో ముందుగానే తెలుసుకోండి. ఇలా సరైన సమయంలో మూత్రం పోయడం మాత్రం మర్చిపోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రాన్ని ఆపే అలవాటు ఆరోగ్యానికి హానికరం. సమయానికి మూత్ర విసర్జన చేయడం ద్వారా, మీరు మూత్ర నాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా తీవ్రమైన సమస్యల నుండి కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




