AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Side Effects: టమాటాతో కలిగే నష్టాలు..? ఈ తీవ్ర వ్యాధులకు కారణం కావచ్చు..

టమాటాలు లేకుండా ఏ వంటకం కూడా పూర్తి కాదనే చెప్పాలి. ఎందుకంటే.. టమాటా మన ఆహారానికి మంచి రుచిని జోడిస్తుంది. టమాటాల్లో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఎన్ని ప్రయోజనాలున్నా, రుచిగా ఉన్నా టమాటాలు ఎక్కువగా తినడం ప్రమాదకరం. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలున్న వారు టమాటాలు ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 09, 2024 | 9:54 PM

Share
టమాటాల్లో కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టమాటాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కోసారి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

1 / 5
టమాటాల్లో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మీ కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. టమాటాలు మన కణాలలో కాల్షియం ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. అయితే ఎక్కువగా తీసుకుంటే ఇది వాపుకు దారి తీస్తుంది. నిలబడటం, కూర్చోవడం, ఒక్కోసారి నడవడం కూడా కష్టంగా మారుతుంది.

2 / 5
టమాటాలో హిస్టామిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో అలర్జీల సమస్యలను కలిగిస్తుంది. టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటి వాపు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీకు ఇప్పటికే ఈ సమస్యలన్నీ ఉంటే, మీ ఆహారంలో టమటాల వినియోగాన్ని తగ్గించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3 / 5
టమాటాల్లో ఆమ్ల స్వభావం ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. టమాటాలు అధికంగా తింటే గుండెల్లో మంట, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అధిక అసిడిటీ సమస్య ఉన్నవారు టమాటాలు మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

4 / 5
చాలామందికి రక్తం త్వరగా గడ్డకట్టదు. దీనికోసం మందులు వాడుతుంటారు. టమాటాలు తినడం వల్ల రక్తం గడ్డకట్టేలా చేసే మందులకు హాని కలుగుతుంది. రక్తం పలుచగా ఉండేవాళ్లు టమాటాలకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us