తరచుగా కడుపు నొప్పి కాలేయ వ్యాధుల లక్షణం కావచ్చు.. జర జాగ్రత్త..
కడుపునొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య.. కానీ మీరు చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నా.. లేకపోతే.. మీకు కొన్ని రోజులకొకసారి కడుపు నొప్పి వస్తుంటే దానిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే.. ఇది కొన్ని తీవ్రమైన కాలేయ వ్యాధికి సంకేతం కావచ్చు. దీని గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు.. కాలేయ వ్యాధుల సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో కాలేయ వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి సర్వసాధారణమైపోయింది. కాలేయ వైఫల్యం కేసులు కూడా పెరుగుతున్నాయి. తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి వల్ల ఇలా జరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ వ్యాధి విషయంలో, చాలా మంది ప్రజలు దాని ప్రారంభ లక్షణాలను గుర్తించలేరు.. కానీ దాని సంకేతాలు ముందుగానే కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని ఎప్పుడూ విస్మరించకూడదు. ఉదాహరణకు, కడుపు నొప్పి కూడా అనేక కాలేయ వ్యాధులకు సంకేతం. మీరు చాలా కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నా.. లేదా కొన్ని రోజులకొకసారి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటే, దానిని నిర్లక్ష్యం చేయకండి.
WHO ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2.59 లక్షల మంది కాలేయ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. అన్ని వ్యాధుల కారణంగా సంభవించే మొత్తం మరణాలలో ఇది 2.95%. భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి కాలేయ వ్యాధి ఉంది. గత కొన్ని సంవత్సరాలలో, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. దాని రేటు 6.7% నుంచి 55.1% మధ్య ఉంటుంది. కాలేయ వ్యాధి యొక్క చాలా సందర్భాలలో, ప్రజలు దాని ప్రారంభ లక్షణాలను విస్మరిస్తారు. కడుపు నొప్పి కాలేయ వైఫల్యానికి ప్రారంభ సంకేతమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కడుపు నొప్పి ఏ కాలేయ వ్యాధులకు లక్షణం?
కడుపులో నిరంతర నొప్పి కాలేయం పెరగడం ప్రధాన లక్షణం అని ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలోని మెడిసిన్ విభాగంలో డాక్టర్ సుభాష్ గిరి చెబుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయిందనడానికి ఇది సంకేతం కావచ్చు. ఇది కాలేయ వైఫల్యానికి సంకేతం అయిన ప్రారంభ లక్షణం. అనేక సందర్భాల్లో, నిరంతర కడుపు నొప్పి వైరల్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కడుపునొప్పి, జ్వరం లేదా కొద్దికాలం పాటు వికారం ఏర్పడవచ్చు.
నిరంతర కడుపు నొప్పి కాలేయంలో మంట లేదా గాయానికి సంకేతం. అటువంటి పరిస్థితిలో, మీకు కడుపు నొప్పి సమస్య కొనసాగితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. అల్ట్రాసౌండ్ లేదా రక్త పరీక్ష సహాయంతో.. వైద్యులు ఏదైనా కాలేయ వ్యాధిని సులభంగా గుర్తించగలరు.
కాలేయ ఆరోగ్యాన్ని ఎలా చక్కగా ఉంచుకోవాలి
మీ ఆహారంలో కనీస ఉప్పు, చక్కెర, పిండిని తక్కువ ఉండేలా చూసుకోండి.. లేకపోతే.. సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండండి..
జంక్ ఫుడ్ తినవద్దు
ప్రతిరోజూ 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలి
రోజువారీ వ్యాయామం
మద్యం సేవించవద్దు
మీ రోజువారీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూసుకోండి.
ఎటువంటి కారణం లేకుండా ఎలాంటి ఔషధాలను తీసుకోకుండా ఉండండి
వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినవద్దు
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..