Pomegranate Benefits: చలికాలంలో రోజూ ఒక దానిమ్మ తినడం వలన ఈ సమస్యలు తగ్గుతాయట.. ఎలాగంటే..

దానిమ్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. దానిమ్మను రోజూ తీసుకోవడం వలన శరీరంలో రక్తాన్ని పెంచడమే

Pomegranate Benefits: చలికాలంలో రోజూ ఒక దానిమ్మ తినడం వలన ఈ సమస్యలు తగ్గుతాయట.. ఎలాగంటే..
Pomegranate
Follow us

|

Updated on: Dec 19, 2021 | 9:46 AM

దానిమ్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. దానిమ్మను రోజూ తీసుకోవడం వలన శరీరంలో రక్తాన్ని పెంచడమే కాకుండా.. అనేక లాభాలను చేకూరుస్తుంది. ఇతర పండ్ల కంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు.. ఇందులో విటమిన్ సి, ఇ, కె కూడా ఉంటాయి. దానిమ్మను నేరుగా తినడమే కాకుండా జ్యూస్‏గా తీసుకున్న రెట్టింపు ప్రయోజనాలుంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు దానిమ్మను తీసుకోవడం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అయితే చలికాలంలో దానిమ్మను తినొచ్చా ? లేదా ? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. కానీ చలికాలంలో రోజూ ఒక దానిమ్మను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలుండడమే కాకుండా.. పలు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

చలికాలంలో దానిమ్మను తినడం వలన ప్రయోజనాలు..

1. దానిమ్మలో ఉండే పాలీఫెనాల్స్ కారణంగా ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇతర పండ్ల కంటే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి. ఈ కారణంగా వాపు తగ్గుతుంది. అలాగే కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. 2. దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రోజువారీ విటమిన్ సీలో 40 శాతం దానిమ్మలో ఉంటుంది. దీనివలన శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. 3. దానిమ్మ రోజూ తీసుకోవడం వలన పేగులలో కలిగే మంట తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో చికాకు లేదా అల్సర్ సమస్య ఉన్నవారికి దానిమ్మ పండు చాలా మంచిది. 4. ఇందులో యయాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం అంతటా మంటల నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. 5. కీళ్లనొప్పులు ఉన్నవారు దానిమ్మను రోజూ తీసుకోవాలి. ఇది ఆర్థరైటిస్ వలన కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. బోలు ఎముకల వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర రకాల ఆర్థరైటిస్ వ్యాదులతోపాటు.. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో దానిమ్మ సహాయపడుతుంది. 6. దానిమ్మ రసం తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు చాలా మేలు చేస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్త నాళాలు మందంగా, గట్టిపడకుండా నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ ఏర్పడే వేగం, ధమనులలో చేరడం కూడా నెమ్మదిస్తుంది. 7. అధిక రక్తపోటు ఉన్న రోగులకు దానిమ్మ చాలా మంచిది. రక్తపోటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. 8. ప్రస్తుతం యువత ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య జ్ఞాపకశక్తి తగ్గిపోవడం. ఇటీవల అధ్యాయనంలోనూ ప్రతి రోజూ దానిమ్మ తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతున్నట్లుగా తెలీంది. 9. మధుమేహాన్ని నియంత్రించడానికి దానిమ్మ ఉపయోగపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. 10. శరీరానికి కావాల్సిన విటమిన్ సీ, ఇ కాకుండా.. ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె కూడా దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి.

Also Read:  Bigg Boss 5 Telugu: షణ్ముఖ్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నాడా.? దీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్పిందా.?

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 విన్నర్‌ సన్నీనేనా.. రెండో స్థానంలో కూడా నిలవని షణ్ముఖ్‌.? వైరల్‌ అవుతోన్న వార్త..

Bigg Boss 5 Telugu Ep.105: సందడిగా 5వ సీజన్ ఫైనల్ డే.. హౌస్‌లో రచ్చ చేసిన మాజీ కంటెస్టెంట్స్..

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ 5 తెలుగు గ్రాండ్‌ ఫినాలే.. ఎప్పుడు.. ఎక్కడ.. ముఖ్య అతిథులుగా ఎవరు..?

Latest Articles
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..