Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ఎండు ద్రాక్షను ఇలా వాడితే.. ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతం..!

Raisins: మీరు ఇంట్లోనే చాలా సులభంగా ఎండుద్రాక్ష ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. దీంతో ఆరోగ్యంతోపాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

Skin Care Tips: ఎండు ద్రాక్షను ఇలా వాడితే.. ఆరోగ్యంతోపాటు మెరిసే చర్మం మీ సొంతం..!
Raisins
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2021 | 7:12 PM

Skin Care Tips: ఎండుద్రాక్ష వినియోగం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. మనల్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా, ఇది అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనలో చాలా మంది ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటుంటారు. కానీ, ఎండు ద్రాక్ష ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. ఎండు ద్రాక్షను ఉపయోగించడం ద్వారా మీ చర్మాన్ని మెరిసేటట్లు ఎలా చేసుకోవచ్చో ఇఫ్పుడు తెలుసుకుందాం. రైసిన్ ఫేస్ ప్యాక్, టోనర్, జెల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుదాం.

రైసిన్ ఫేస్ ప్యాక్.. మీరు ఇంట్లోనే చాలా సులభంగా రైసిన్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి, 4 చెంచాల ఎండుద్రాక్షను తీసుకొని వాటిని నీటిలో నానబెట్టి ఉంచండి. ఉదయం లేవగానే ఎండు ద్రాక్షను జల్లెడ పట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. దీని తరువాత, తేనె, ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిని కొద్దిగా కలపాలి. దీని తరువాత మీ ముఖం మీద అప్లై చేసి, కనీసం 20 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌తో మీరు మొటిమల సమస్య నుంచి విముక్తి పొందుతారు. దీనితో పాటు, ఇది ముఖంపై ఉన్న ఫైన్ లైన్లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మొటిమలు, వడదెబ్బను తొలగించడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎండు ద్రాక్ష ఫేస్ టోనర్‌ తయారీ.. రైసిన్ ఫేస్ టోనర్‌ను తయారు చేయడానికి, ముందుగా, రెండు టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్షను తీసుకొని వాటిని ఒక గిన్నెలో నీళ్లుపోసి నానబెట్టాలి. దీని తరువాత, ఉదయాన్నే లేచి, నీటిని వడపోసి, అందులో 2 చెంచాల నిమ్మరసం వేయండి. దానికి రోజ్ వాటర్ కూడా కలపండి. స్ప్రే బాటిల్‌లో ఉంచుకోవాలి. దీనిని ఫేస్ టోనర్‌గా వాడుకోవాలి. ఇది మీ చర్మాన్ని డీప్ క్లీన్ చేయడం ద్వారా హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

రైసిన్ జెల్ తయారీ.. రైసిన్ జెల్ రెడీ చేయడానికి , ముందుగా ఒక గిన్నె నీటిలో 6 స్పూన్ల ఎండుద్రాక్షలను నానబెట్టాలి. దీని తర్వాత, ఎండుద్రాక్షను వేరు చేసి, వాటిని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌కు అలోవెరా జెల్‌ను జోడించాలి. దీని తర్వాత విటమిన్-ఇ క్యాప్సూల్ కూడా కలపాలి. ఎండు ద్రాక్ష నీరు పోసి మిక్స్ చేసుకోవాలి. ఎయిర్ టైట్ డబ్బాలో నిల్వచేసుకోవాలి. జెల్ అవసరమైనప్పుడు ఈ రైసిన్ జెల్ ఉపయోగించండి. ఇది చర్మంలోని ఇన్ఫెక్షన్‌ని తొలగిస్తుంది. అనేక రకాల చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Pomegranate Benefits: చలికాలంలో రోజూ ఒక దానిమ్మ తినడం వలన ఈ సమస్యలు తగ్గుతాయట.. ఎలాగంటే..

పిల్లలు రోగాల బారిన పడొద్దంటే ఇవి తప్పనిసరి..! కానీ ఎంత మొత్తంలో అంటే..?