AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేక్‏ఫాస్ట్ మానేసిన వారిలో ఈ సమస్యలు తప్పవు.. షాకింగ్ విషయాలు మీకోసం..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా వరకు జీవన శైలీ మారిపోయింది. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోని ఉండడం.. ఉదయాన్నే

బ్రేక్‏ఫాస్ట్ మానేసిన వారిలో ఈ సమస్యలు తప్పవు.. షాకింగ్ విషయాలు మీకోసం..
Breakfast
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2021 | 11:04 AM

Share

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా వరకు జీవన శైలీ మారిపోయింది. రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కోని ఉండడం.. ఉదయాన్నే లేట్ గా లేవడం.. బ్రేక్ ఫాస్ట్ తినకుండా.. నేరుగా లంచ్ చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఉదయం అల్పాహారం చేసే సమయంలో చిరుతిళ్లు తినడం.. ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. దీంత తీవ్రమైన తలనొప్పితోపాటు.. ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ మానేసిన వారిలో అనేక సమస్యలు వస్తుంటాయి. అవెంటో తెలుసుకుందామా.

ఉదయం అల్పాహారం తీసుకోని వారిలో పోషకాలు లోపిస్తుంటాయని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అల్పాహారంగా ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసే వంటి పదార్థాలు తీసుకోడం మేలు.. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒకవేళ ఇవి తినాలని లేని వారు.. మొలకెత్తిన విత్తనాలు.. ఉడికించిన కొడిగుడ్లు, నూనె లేకుండా చాపతీలు, పండ్ల రసాలు, ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలిపి సలాడ్స్ తీసుకోవాలి. ఇవి అనారోగ్య కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి. ఇవే కాకుండా.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే… జ్ఞాపకశక్తిని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు సైతం ఉదయం అల్పాహారం తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ మానేసిన వారిలో ఎక్కువగా అలసట, చిరాకు, కోపం వంటి సమస్యలు కలుగుతాయి.

Also Read: Tollywood: ‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఎవరెవరికి షాకులు.. ఎలాంటి సెన్సేషన్స్ ..!

MAA: అందరినీ కలుపుకుని వెళ్తానన్న మంచు విష్ణు.. ప్రమాణ స్వీకారం సమయంలో ఇలా చేయడమేంటంటూ ప్రశ్నలు.!

Adipurush: షూటింగ్ పూర్తిచేసుకున్న జానకి.. మిగిలింది ఇక రాముడి వంతే… చివరి దశలో ఆదిపురుష్..

Balakrishna AHA: ఆహా టాక్ షో కోసం బాల‌కృష్ణ అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారా.? ఒక్క ఎపిసోడ్‌కి ఏకంగా..