ఈ పదార్థాలను రాగి పాత్రలలో అస్సలు తీసుకోవద్దు.. మర్చిపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే..
రాగి పాత్రలలో నీళ్లు తాగడం.. ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిన సంగతే. రాత్రిళ్లు రాగి పాత్రలలో నీళ్లు పెట్టి.. ఉదయాన్నే
రాగి పాత్రలలో నీళ్లు తాగడం.. ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలిసిన సంగతే. రాత్రిళ్లు రాగి పాత్రలలో నీళ్లు పెట్టి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇలా పరగడపున రాగి పాత్ర ద్వారా నీళ్లు తాగితే బరువు తగ్గుతారు. రాగి పాత్రలలో మరిన్ని ప్రయోజనాలున్నాయి. అయితే వీటితో లాభాలున్నా.. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నారు.. రాగి పాత్రలలో కొన్ని పదార్థాలను పెడితే ఆరోగ్యానికి హానికరమవుతుంది. అవెంటో తెలుసుకుందామా.. 1. పాలు లేదా పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచకూడదు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఫుడ్ పాయిజనింగ్, నాడీనెస్ సమస్యను పెంచుతుంది. పాలు, పెరుగు, జున్ను రాగి పాత్రలలో పెడితే విషంగా మారే అవకాశం ఉంటుంది. 2. మజ్జిగ, లస్సీ ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటిని రాగి పాత్రలలో తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదకరం.. 3. ఊరగాయలు.. పుల్లని పదార్థాలను రాగి పాత్రలో అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుల్లని పదార్థాలు రాగి పాత్రలతో సులభంగా స్పందిస్తాయి. దీంతో వాంతులు లేదా జీర్ణక్రియ సమస్యలు కలుగుతాయి. 4. నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. కానీ నిమ్మరసం రాగి పాత్రలో తాగితే ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. నిజానికి నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది. ఇది రాగితో వేగంగా స్పందిస్తుంది. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి వంటి సమస్యలను ప్రారంభించవచ్చు.
Sekhar Kammula: ‘లీడర్’ సీక్వెల్‌లో రానా కాకుండా ఆ స్టార్ హీరోని అనుకుంటున్నారట.. ఇంతకు ఆయన ఎవరంటే..
Ramarao On Duty: రొమాంటిక్ మూడ్ లో’ రామారావు’.. మాస్ రాజా మూవీనుంచి అదిరిపోయే పోస్టర్.