Honey In Warm Water: గోరు వెచ్చని నిమ్మరసం నీటిలో తేనె కలపకూడదా? వీడియో

Honey In Warm Water: గోరు వెచ్చని నిమ్మరసం నీటిలో తేనె కలపకూడదా? వీడియో

Phani CH

|

Updated on: Oct 16, 2021 | 9:49 AM

బరువు తగ్గడానికి చాలా మంది పరగడుపున గోరు వెచ్చని నిమ్మరసం నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుందని అంటారు.

బరువు తగ్గడానికి చాలా మంది పరగడుపున గోరు వెచ్చని నిమ్మరసం నీటిలో తేనె కలుపుకొని తాగుతారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుందని అంటారు. తేనె సహజ స్వీటెనర్. యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉంటుంది. కాలిన గాయాలకు చికిత్స చేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. తేనె ప్రాసెస్ చేయబడిన చక్కెరకు ప్రత్యామ్నాయం. డయాబెటిస్ రోగులకు సురక్షితం. ఇందులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, జింక్‌ అధికంగా ఉంటాయి. అయితే తేనెను వేడి నీటిలో కలుపకూడదన్నది ఆయుర్వేద నిపుణుల మాట . ఇలా కలిపితే శరీరానికి హానికరమని చెబుతున్నారు. వేడి చేసిన తేనె స్లో పాయిజన్‌గా పని చేసి దాని లక్షణాలు శరీరంలో ఒక్కోసారి విషంగా మారుతాయట.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పులితో జెండర్‌ రివీల్‌ చేయడమా? వెర్రి ఆలోచనకు ట్రోలింగ్‌! వీడియో

Payments Without Internet: నెట్ అవసరం లేదు..యాప్‌‌తో పనిలేదు..స్మార్ట్ ఫోన్ అక్కరలేదు.. డబ్బు పంపించేయండిలా..! వీడియో