Stomach Gas : ఈ పొరపాట్లు చేస్తే కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తుంది.. ఎలా తగ్గించుకోవాలంటే..

ప్రస్తుతం ఆధునిక కాలంలో కడుపులో గ్యాస్ ఏర్పడడం అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు

Stomach Gas : ఈ పొరపాట్లు చేస్తే కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తుంది.. ఎలా తగ్గించుకోవాలంటే..
Health
Follow us

|

Updated on: Apr 06, 2022 | 7:14 AM

ప్రస్తుతం ఆధునిక కాలంలో కడుపులో గ్యాస్ ఏర్పడడం అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కడుపులో గ్యాస్ ఏర్పడడం వలన ఆకలి తగ్గుతుంది. అంతేకాకుండా.. కడుపు ఉబ్బరం, బలహీనత, నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన ఛాతీ, భుజాలపై ప్రభావం చూపిస్తుంది. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. పెద్ద ప్రేగులో ఉండే బ్యాక్టీరియా వాయువును తయారు చేస్తుంది. ఇది ఆహార కణాలను విచ్చిన్నం చేస్తుంది. గ్యాస్ సమస్య ఏర్పడినప్పుడు కడుపు నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. బ్రోకలీ, క్యాబేజీ, ఫిజీ డ్రింక్స్, బీన్స్ వంటి పదార్థాలు గ్యాస్‌ను పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గ్యాస్ ఏర్పడడమనేది ఆరోగ్యానికి ప్రమాదకరం. కడుపులో ఉబ్బరం అండాశయ క్యాన్సర్‏కు ఇది ప్రధాన సంకేతం..

ఎలా తగ్గించుకోవాలంటే..

1. ఫిజీ డ్రింక్స్‎ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. బ్రోకలీ, బీన్స్ వంటి పదార్థాలను ఆస్సలు తీసుకోవద్దు.

2. చాలా మంది పాల ఉత్పత్తులను ఉపయోగించడం వలన గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పదార్థాలను దూరంగా ఉండాలి.

3. వేయించిన ఆహారం, కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం మానివేయాలి. ఇవి జీర్ణవ్యవస్థలో గ్యాస్ సమస్యను ఏర్పరుస్తాయి.

4. కడుపులో గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడే వారు అల్లం, పుదీనా నీరు కలిపి తీసుకోవాలి. అంతేకాకుండా.. ఫెన్నెల్, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా ఉపయోగపడుతుంది.

5. గోరు వెచ్చని నీరు లేదా హెర్బల్ టీ తాగడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవాచ్చు. 6. అలాగే కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది.

గమనిక :- ఈ కథనం కేవలం ఇతర నివేదికల ఆధారంగా.. నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Also Read: Rashmi Gautam: యాంకరమ్మ అందాలకు క్లీన్ బౌల్డ్ అవుతున్న ఫాన్స్.. రష్మీ లేటెస్ట్ ఇమేజెస్

Rashmika Mandanna: బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..

Samantha-Yashoda: యశోద సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Beast: బీస్ట్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. పవర్‏పుల్ యాక్షన్‏తో అదరగొట్టిన విజయ్ దళపతి..