AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Tips: మధుమేహం వెంటాడుతోందా..? ఈ డ్రై ఫ్రూడ్స్ తప్పకుండా తీసుకోండి.. బెస్ట్ రిజల్ట్స్‌ పక్కా..

ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు ఇందులో..

Diabetes Tips: మధుమేహం వెంటాడుతోందా..? ఈ డ్రై ఫ్రూడ్స్ తప్పకుండా తీసుకోండి.. బెస్ట్ రిజల్ట్స్‌ పక్కా..
Walnut For Diabetes
Sanjay Kasula
|

Updated on: Mar 08, 2022 | 2:37 PM

Share

Walnut For Diabetes: వాల్‌నట్.. ఇది డ్రై ఫ్రూట్. దీని రుచి తినడానికి చాలా బాగుంటుంది. తినడానికి రుచికరమైనదే కాదు అనేక వ్యాధులకు చికిత్స చేసే ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత దృంగా మార్చుతాయి. హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం వారానికి ఐదు కంటే ఎక్కువ వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల ప్రమాదవశాత్తు మరణించే అవకాశాలను నివారిస్తుంది. ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వాల్‌నట్‌ల వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. షుగర్ పేషెంట్లు వాల్‌నట్‌లను నానబెట్టి నేరుగా తినవచ్చు. వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా మధుమేహం ఎలా అదుపులో ఉంటుందో.. ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించాలి: డయాబెటిక్ రోగుల ఆహారం వారి చక్కెర నియంత్రణలో ఉండేలా ఉండాలి. చక్కెరను నియంత్రించడంలో వాల్‌నట్ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్సులిన్ మెరుగ్గా పని చేయడానికి వాల్‌నట్స్ సహాయపడతాయి.

వాల్‌నట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వాల్ నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ విచ్ఛిన్నం, జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది రక్త ప్రసరణలో చక్కెర అప్-డైన్ లను నియంత్రణలో ఉంచుతుంది. వాల్‌నట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందనే దాని ఆధారంగా ఆహారాలలో కార్బోహైడ్రేట్ల ర్యాంకింగ్ ఉంటుంది. షుగర్ రోగులకు GI సూచిక 55 కంటే తక్కువ ఉన్న ఆహారాలు అనువైనవిగా పరిగణించబడతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వాల్‌నట్‌లను ఎలా తీసుకోవాలి: చక్కెర రోగులు వాటిని సలాడ్‌లు, స్మూతీస్ లేదా వాటి తృణధాన్యాలలో కలపడం ద్వారా వాల్‌నట్‌లను తినవచ్చు. మీరు మీ రెగ్యులర్ డైట్‌లో వాల్‌నట్‌లను చేర్చుకోవడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.

రోగనిరోధకశక్తి: వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న వాల్ నట్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మలబద్ధకం నుంచి ఉపశమనం: ఫైబర్ అధికంగా ఉండే వాల్‌నట్స్ మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన వాల్‌నట్‌లు గుండె ఆరోగ్యానికి మేలు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్‌ను తరయారు చేయడంలో సహాయపడతాయి.

బరువు తగ్గుతారు: వాల్‌నట్స్‌ తీసుకోవడం ద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది. వాల్‌నట్‌లను తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది, ఇది అదనపు కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి: Chicken Price: బాబోయ్‌.. ఈ చికెన్ చిక్కనంటోంది.. కోడి ధర తగ్గనంటోంది.. కారణం ఇదే!

నేను దేనికీ భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు