AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetables: ఈ కూరగాయలు తీసుకోండి.. వేసవి తాపం నుంచి తప్పించుకోండి..

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. పలు రకాల పండ్లు తీసుకోవడంతో వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు...

Vegetables: ఈ కూరగాయలు తీసుకోండి.. వేసవి తాపం నుంచి తప్పించుకోండి..
Vegetables
Srinivas Chekkilla
|

Updated on: Mar 08, 2022 | 2:41 PM

Share

ఎండలు(Summer) అప్పుడే మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత(Temperature) క్రమంగా పెరుగుతోంది. పలు రకాల పండ్లు తీసుకోవడంతో వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. ఎండకాలం పుచ్చకాయ తినడం చాలా మంచిది. కీరదోసకాయ కూడా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ, కీరదోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ శరీరం డిహైడ్రెషన్‌ గురికాకుండా చూస్తుంది. కొన్ని కూరగాయలు(Vegetables) వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం…

టమాటా: టమాటాలో 95 శాతం నీరు సమృద్ధిగా మనకు లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి9 , విటమిన్ K 1 శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ టమాటాలలో ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది.. కాబట్టి మనకు జీర్ణక్రియ రేటును పెంచుతుంది. ముఖ్యంగా టమాటాతో ఎండా కాలంలో వేడి తాపాన్ని తగ్గించుకోవచ్చు.

వంకాయలు: వంకాయలు వేడి చేస్తాయని.. వైద్యులు కూడా చెబుతున్న విషయమే కానీ ఇందులో ఉండే క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి పుష్కలంగా లభించడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారిస్తుంది. అంతే కాదు మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇక వేడి వల్ల కలిగే మలబద్దకం సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివి దూరం చేయడానికి వంకాయలు చాలా బాగా పనిచేస్తాయి.

కాకరకాయ: ఎండాకాలం మొదలైంది అంటే చర్మంపైన సోరియాసిస్, పొక్కులు వంటివి వస్తాయి.. కానీ కాకర కాయ తినడం వల్ల ఈ సమస్యలను మనం దూరం చేసుకోవడమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.

క్యారెట్: సంవత్సరం పొడవునా మనకు అందుబాటులో ఉండే క్యారెట్లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరం కూడా చల్లబడుతుంది.

ఉసిరి: మంచి ఆరోగ్యాన్ని కలిగించే ఉసిరి వల్ల మనకు విటమిన్ సి, మినరల్స్, ఫైబర్ వంటివి లభిస్తాయి.. ఇక శక్తిని బలపరచడానికి కూడా ఉసిరి కాయలు బాగా పనిచేస్తాయి.

Read Also.. Brown Sugar: బ్రౌన్ షుగర్‌తో తళుక్కుమనే నిగారింపు మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..?