- Telugu News Photo Gallery Brown sugar is best in beauty care, these five skin problems can stay away in Telugu
Brown Sugar: బ్రౌన్ షుగర్‌తో తళుక్కుమనే నిగారింపు మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..?
Beauty Care: చర్మ సౌందర్యం కోసం చాలామంది పలు రకాల బాడీ లోషన్ క్రీంలను, ఫేస్ క్రీమ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే.. కొన్ని ఇంటి చిట్కాలతో ఫేస్‌ను తళతళలాడేలా చేసుకోవచ్చు. అలాంటి పదార్ధాలలో బ్రౌన్ షుగర్ ఒకటి.
Updated on: Mar 07, 2022 | 9:59 PM


మచ్చలు తొలగిస్తుంది: ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంపైనున్న హానికరమైన టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దీంతోపాటు చర్మం నిగారింపు పెరుగుతుంది. దీని కోసం.. కొబ్బరి నూనెలో కొంచెం బ్రౌన్ షుగర్ వేసి రెండు కలిపి ముఖంపై స్క్రబ్ చేయాలి.

స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్: చర్మంపై రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే.. దీని ప్రభావం జుట్టు, చర్మం రెండింటిపై ప్రభావం చూపుతుంది. చర్మ రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బ్రౌన్ షుగర్, తేనె మిశ్రామాన్ని ముఖంపై స్క్రబ్ చేయాలి.

యాంటీ ఏజింగ్ లక్షణాలు: బ్రౌన్ షుగర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ముఖంపై అకాల ముడతలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనిని యాంటీ ఏజింగ్ ఏజెంట్ అని కూడా అంటారు. ఈ సమస్యను అధిగమించడానికి బ్రౌన్ షుగర్‌లో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి స్క్రబ్ చేయాలి.

డెడ్ స్క్రిన్ తొలగిస్తుంది: ముఖంపై రంధ్రాలు, ఎర్రటి ఛారలు కారణంగా మన అందం ప్రభావవంతంగా కనిపించదు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మీరు బ్రౌన్ షుగర్లో తేనెను కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీంతో మసాజ్ చేయడం వల్ల రంద్రాలు క్లియర్ అయ్యి ముఖం కూడా మెరిసిపోతుంది.

స్కిన్ టానింగ్: చర్మంపై ఉన్న టానింగ్‌ను తొలగించడం పెద్ద సమస్యగా మారుతుంది. ఇందుకోసం బ్రౌన్ షుగర్ తీసుకుని అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.




