Women’s Health Tips: పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలతో బాధపడుతున్నారా.? అయితే వీటిని తెలుసుకోవాల్సిందే..
Health Tips for Women: పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మహిళలు కడుపు నొప్పి, వెన్నునొప్పి, బాడీ పెయిన్స్, అలసట వంటి అనేక సమస్యలతో
Women’s Day 2022: పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమయంలో మహిళలు కడుపు నొప్పి, వెన్నునొప్పి, బాడీ పెయిన్స్, అలసట వంటి అనేక సమస్యలతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు హార్మోన్లలో లోపం, అనారోగ్యకరమైన ఆహారం ( Womens Heallth ) కారణంగా పీరియడ్స్ సమయంలో ఇలాంటి సమస్యలు అధికం కావొచ్చు. దీనివల్ల నొప్పులు మరింత పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. మహిళలు తినే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. తద్వారా పీరియడ్స్ (Periods) సమయంలో ఎలాంటి ప్రభావం ఉండదు. పీరియడ్స్ సమయంలో ఓట్ మీల్, పండ్లు, తగినంత నీరు తాగడం, అల్లం వంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇదే కాకుండా డైట్‌లో ఏ ఇతర ఆహారాలను చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు: పీరియడ్స్ సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఎక్కువ నీరు తాగాలి. పీరియడ్స్ సమయంలో డీహైడ్రేషన్ కారణంగా తలనొప్పి వస్తుంది. దీంతోపాటు కడుపు ఉబ్బరం పెరుగుతుంది. ఎక్కువ నీరు తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
పండ్లు: పీరియడ్స్ సమయంలో పుచ్చకాయ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. ఇలాంటి పండ్లను తినడం వల్ల హైడ్రేటెడ్ ఉండవచ్చు.
ఆకు కూరలు: పీరియడ్స్ సమయంలో శరీరంలో ఐరన్ లోపిస్తుంది. ఐరన్ లోపం వల్ల అలసట, తల తిరగడం, శరీర నొప్పులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఐరన్ లెవల్స్‌ను మెయింటైన్ చేయడానికి పచ్చని ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.
అల్లం: అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం వికారం, వాంతులు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే.. దీనిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ చాక్లెట్ తినడం వల్ల మెగ్నీషియం PMS లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. నట్స్ ఐరన్ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో, ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయపడతాయి.
వోట్మీల్ – మిల్లెట్: పీరియడ్స్ సమయంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని కారణంగా మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటుంది. మీరు అల్పాహారం లేదా రాత్రి భోజనంలో వోట్మీల్, మిల్లెట్లను తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.
Also Read: