COVID-19: గుండె సమస్యలున్న వారిలో కరోనా తీవ్రత ఎక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి
COVID-19: గుండె సమస్యతో బాధపడేవారు కోవిడ్ బారిన పడి ఆస్పత్రుల్ఓల చేరితే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తాజా..
COVID-19: గుండె సమస్యతో బాధపడేవారు కోవిడ్ బారిన పడి ఆస్పత్రుల్ఓల చేరితే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తాజా అధ్యయనం (Study)లో తేలింది. గుండె లోపాలు (Heart Problems) లేనివారితో పోలిస్తే వీరికి కోవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలాగే మరణించే శాతం అధికంగా ఉంటుందని తెలిపారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ సర్క్యూలేషన్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితం అయ్యాయి.
గుండె సమస్యలున్న వారికి కరోనా సోకితే వారికి ఐసీయూలో చికిత్స కానీ.. వెంటిలేటర్ అవసరం కానీ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సమస్యలు, 50 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు కరోనాతో ముప్పు ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. పుట్టుకతోనే గుండె లోపాలు ఉన్న వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో 157 మంది ఉంటారని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ వివరాలన్ని గుండె జబ్బులు, స్ట్రోక్ గణాంకాలు-2022 నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే మార్చి 2020 నుంచి జనవరి 2021 వరకు ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల వివరాలను పరిశోధకులు పరిశీలించారు. గుండె లోపాలు కలిగిన, గుండె లోపాలు లేని రోగులు ఇవే ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. వయసు, లింగం, జాతి, ఆరోగ్య బీమా రకాలు, గుండె జబ్బులు, పల్మనరీ హైపర్ టెన్షన్, డౌన్ సిండ్రోమ్, మధుమేహం, స్ధూలకాయం వంటి అధిక ముప్పు కారకాల ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
ఇవి కూడా చదవండి: