AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను దేనికీ భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు

మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా.. ఇప్పటికీ వివక్ష(Discriminated)కు గురవుతూనే ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Telangana Governor Soundara Rajan) ఆవేదన వ్యక్తం చేశారు. సమాన హక్కులను...

నేను దేనికీ భయపడను.. నన్నెవరూ భయపెట్టలేరు.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Tamisi Soundara Rajan
Ganesh Mudavath
|

Updated on: Mar 08, 2022 | 8:47 AM

Share

మహిళలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా.. ఇప్పటికీ వివక్ష(Discriminated)కు గురవుతూనే ఉన్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్(Telangana Governor Soundara Rajan) ఆవేదన వ్యక్తం చేశారు. సమాన హక్కులను డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని అన్నారు. మహిళకు సరైన గౌరవం దక్కడం లేదని, అత్యున్నత పదవిలో ఉన్న మహిళలకూ అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏ స్త్రీ తన స్వార్థం కోసం ఏదీ కోరుకోదని. ప్రతిదీ తన కుటుంబం కోసమే ఆలోచిస్తుంది అని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. భారతీయ మహిళ(Indian Women) ఎవరికీ భయపడదని, తానూ దేనికీ భయపడనని, తననెవరూ భయపెట్టలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమాభిమానాలు పంచుతూ శాంతియుత జీవనం కొనసాగేందుకు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని గవర్నర్‌ గుర్తు చేశారు. మహిళలు జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్నా ఆర్థిక స్వతంత్రం, ఆరోగ్యవంతంగా ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. మహిళలు సాధించిన అద్భుత విజయాలను గుర్తు చేసుకొని వారిని గుర్తించడం మహిళా దినోత్సవం ఉద్దేశమని అన్నారు.

ప్రతి మహిళా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల పట్ల స్వీయ నిర్ణయం పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందాన్ని వదులుకోకూడదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని వైపు అడుగులు వేయాలి. సవాళ్లతో కూడిన పనులు చేయాలి. పనుల్లో రాణించాలి. తమిళనాడు మహిళలకు, తెలంగాణ స్త్రీలకు తేడా ఏంటని.. ఇటీవల నన్ను ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అందరూ ఒకేలా ఉంటారని చెప్పాను. తెలంగాణ సోదరిగా నేను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతాను

             – తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్( Governor Tamilisai Soundara Rajan) సోమవారం దర్శించుకున్నారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. యాదాద్రి(Yadadri) ప్రధానాలయాన్ని సందర్శించారు. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్టపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. నాలుగో రోజు వటపత్రసాయి అలంకార సేవ(Vatapatra sai seva)లో లక్ష్మీ నరసింహస్వామి వారిని గవర్నర్ దర్శించుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. తెలంగాణ బడ్జెట్ ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా బడ్జెట్ ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

Also Read

IIT Bombay CEED 2022 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

NEET UG 2021 Counselling: ఆ సర్టిఫికేట్‌ లేనికారణంగా అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేయొద్దు! అవసరమే కానీ తప్పనిసరేంకాదు..

Indians stocking: భయంతో వాటిని ఎక్కువ కొంటున్న భారతీయులు.. నిపుణులు ఏమంటున్నారంటే..