Chicken Price: బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది.. కోడి ధర తగ్గనంటోంది.. కారణం ఇదే!
Chicken Rate: చికెన్ ధర పరుగులు పెడుతోంది. బర్డ్ ఫ్లూ ప్రచారంతో కిందికి దిగొచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్ల్‌ఫ్లూ భయంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు.
బ్యాగ్ పట్టుకొని.. మార్కెట్‌కు వెళ్తున్నారా.. వీకెండ్‌లో షాప్‌కు వెళ్లి.. చికెన్ తీసుకురావాలనుకుంటున్నారా.. అయితే మీరు షాక్‌కు గురి కావల్సిందే. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా చికెన్ ధర(Chicken Price) ఆల్ టైం హైకి వెళ్లింది. మునుపెన్నడూ లేనంతగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడం.. మాంసం వినియోగం పెరగడంతో.. రోజు రోజుకు ధర పెరుగుతూ వస్తుంది. చికెన్ ధర పరుగులు పెడుతోంది. బర్డ్ ఫ్లూ ప్రచారంతో కిందికి దిగొచ్చిన ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్ల్‌ఫ్లూ భయంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం తగ్గించేశారు. దీంతో కోళ్ల లభ్యత తగ్గి, చికెన్‌కి డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ. 240 దాటింది. మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తోంది. 15 రోజుల క్రితం రూ. 180 రూపాయలు, వారం క్రితం రూ. 210 రూపాయలు.. అది ఇప్పుడు ఏకంగా రూ. 280 రూపాయలకు పెరిగింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇప్పటివరకు కిలో చికెన్ ధర అత్యధికంగా రూ. 260 రూపాయలు పలికింది. అయితే ఇప్పుడు ధర దేశంలోనే రికార్డు స్థాయిలో రూ. 280 రూపాయలకు చేరింది.
కానీ రెండు నెలల కిత్రం బాయిలర్ కోళ్ల ఫామ్ గేట్ రేటు కిలో రూ.100 లోపే ఉందని తెలుస్తోంది. అయితే 10 రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో.. చికెన్ ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం.. దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..
Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్ మేళాకు భారీ స్పందన..