AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్‌ మేళాకు భారీ స్పందన..

బెజవాడలో రౌడీయిజాన్ని తగ్గించడానికి వినూత్న కార్యక్రమం చేపట్టారు పోలీసులు. దీనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విజయవాడ పోలీసులు ఏం చేశారు? ప్రశంసలు ఎందుకు?

Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్‌ మేళాకు భారీ స్పందన..
Job Fair
Sanjay Kasula
|

Updated on: Mar 06, 2022 | 7:34 AM

Share

నగరాల్లో రౌడీలు, రౌడీషీటర్లు(Rowdy Sheeters) అనే మాట కామన్‌ అయిపోయింది. వారిని కట్టడి చేయడానికి పోలీసులు ఏ స్టైల్‌లో పనిచేస్తారో అందరికీ తెలుసు. కానీ, బెజవాడ పోలీసులు(Vijayawada police) వినూత్నంగా ఆలోచించారు. రౌడీయిజం కారణంగా మంచి భవిష్యత్తును కోల్పోయిన వారికి, సమాజంలో గౌరవంగా బతికే దారి చూపుతున్నారు ఏపీ పోలీసులు. రౌడీషీటర్ల కోసం జాబ్ మేళా నిర్వహించారు విజయవాడ పోలీసులు. విజయవాడలో రౌడీషీటర్ల సమస్య ఎప్పటినుంచో ఉందని, వారితో మాట్లాడే సమయంలో సమస్యలు అర్థం చేసుకున్నానని చెప్పారు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా. ఉపాధి అవకాశాలు కల్పిస్తామనడంతో చాలా మంది ముందుకొచ్చారని, పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్లకు సూచించారు సీపీ. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించే చర్యలు చేపట్టామని, 16 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు క్రాంతిరాణా టాటా.

యువత జీవితాన్ని దశల వారిగా నిర్దారించుకుని ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలని సూచించారు సీపీ. సమాజంలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని, విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని వివరించారాయన. తెలిసి తెలియక చేసిన తప్పులను వదిలి కుటుంబం కోసం గౌరవంగా జీవించాలన్నారు. 5, 6 సవంత్సరాలు కష్టపడి పని చేసి గోల్ రిచ్ అవ్వగలిగితే, జీవితం అంతా సుఖంగా ఉండొచ్చని చెప్పారు సీపీ.

పాత జీవితాన్ని వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లకు సూచించారు సీపీ కాంతి రాణా. విజయవాడ అంటే గతంలో ఆరచక శక్తులకు అడ్రస్ గా ఉండేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వచ్చిన తరువాత చాలా మార్పులు వస్తున్నాయన్నారు.

తప్పు దారి పట్టిన వారిని సన్మార్గంలో పెట్టేందుకు పోలీస్ గా పని చేయడంతో పాటు వారికి జీవనోపాధి కల్పించే విధంగా జాబ్ మేళా నిర్వహచడం సంతోషానిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి: Andhra Pradesh: డ్రా చేయకుండానే ఖాతాల నుంచి సొమ్ము ఖతం.. ఆ జిల్లాలో వింత పరిస్థితి

Tamilisai: శాసనసభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళి సై..