Andhra Pradesh: డ్రా చేయకుండానే ఖాతాల నుంచి సొమ్ము ఖతం.. ఆ జిల్లాలో వింత పరిస్థితి

ATMల నుంచి డబ్బులు డ్రా చేస్తే, ఫోన్‌లకు మెసేజ్‌లు రావడం కామన్. మరి డ్రా చేయకున్నా, మనీ డెబిట్‌ అయితే ఏంటీ పరిస్థితి? ఆ సిచ్యుయేషన్‌ మీకు వస్తే ఏం చేస్తారు?

Andhra Pradesh: డ్రా చేయకుండానే ఖాతాల నుంచి సొమ్ము ఖతం.. ఆ జిల్లాలో వింత పరిస్థితి
Small saving Schemes
Follow us

|

Updated on: Mar 05, 2022 | 8:53 PM

Vizag: పిల్లల చదువుల కోసం కొందరు, కూతురు పెళ్లి కోసం మరి కొందరు, ఇళ్లు కట్టుకుందామని ఇంకొకరు, ఇలా చాలామంది బ్యాంకుల్లో డబ్బులు సేవింగ్స్‌ చేసుకున్నారు. కానీ, వారి ప్రమేయం లేకుండా, ఖాతాల నుంచి డబ్బులు మాయమయ్యాయి. డెబిట్‌ అయినట్టు ఫోన్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు ప్రజలు. విశాఖ జిల్లాలో ఖాతాదారులకు ఈ వింత పరిస్థితి ఎదురయ్యింది.  బ్యాంకుల్లో దాచుకున్న ధనం ఎవరికీ తెలియకుండా విత్ డ్రా అయిపోతోంది. వేలల్లో డ్రా చేసినట్టు ఖాతాదారులకు మెసేజ్‌లు వస్తున్నాయి. బ్యాంకుకు వెళ్లి చెప్తే సరైన సమాధానం లేదు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు ప్రజలు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో చాలామంది ఖాతాల నుంచి నగదు మాయమైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 20 మంది ఖాతాదారులకు నగదు వారికి తెలియకుండా విత్ డ్రా అయిపోతోంది. తమ ప్రమేయం లేకుండా ఎలా డబ్బులు మాయమవుతాయని ప్రశ్నిస్తున్నారు ఖాతాదారులు. దీనిపై అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు.

Also Read: Finger millet: ఏంటి మీ డైట్‌లో రాగి లేదా..? అయితే మీరు చాలా కోల్పోతున్నారు.. ఎన్నో ఉపయోగాలు